Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆరోగ్యంBreaking NewsTOP STORIESహైదరాబాద్

Eye Health : ఈ లక్షణాలు కనిపిస్తే.. కళ్లజోడును తప్పనిసరిగా మార్చాల్సిందే.. కంటి ఆరోగ్యం కోసం..!

Eye Health : ఈ లక్షణాలు కనిపిస్తే.. కళ్లజోడును తప్పనిసరిగా మార్చాల్సిందే.. కంటి ఆరోగ్యం కోసం..!

హైదరాబాద్:

ఆధునిక జీవనశైలిలో కంటికి సంబంధించిన సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి సంవత్సరం కంటి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొంతమందికి రెండు సంవత్సరాలకు ఒకసారి పరీక్ష సరిపోవచ్చు. కానీ సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే ఇంకా మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడే నేటి తరుణంలో ఇది చాలా అవసరం. మనలో చాలామంది కంటి ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపించరు. తమకు బాగానే కనిపిస్తుందని భావిస్తారు లేదా ఏదో ఒక సమయంలో అద్దాలు వాడి వదిలేస్తారు. మంచి చూపు ఉన్నవారు కూడా తమ కళ్లను పట్టించుకోకపోవడం సర్వసాధారణం. 40 ఏళ్లపైబడిన వారు కంటి పరీక్షలను విస్మరించడం సాధారణమైపోయింది.

రెండు కళ్ల చూపులో తేడాలు లేదా సాధారణ దృష్టి లోపాలను కూడా చాలామంది గుర్తించలేకపోవచ్చు. కంటి వైద్యుడిని సంప్రదించాల్సిన సమయం ఆసన్నమైందని సూచించే కొన్ని ముఖ్యమైన సంకేతాలను నిపుణులు వివరించారు.

లక్షణాలివే..

పుస్తకాలు చదవడం లేదా ఫోన్ చూడటం కష్టంగా అనిపించడం: చిన్న అక్షరాలు చదవడానికి లేదా ఫోన్ స్క్రీన్‌ను చూడటానికి కష్టంగా ఉంటే, ఇది దృష్టిలో మార్పునకు సంకేతం.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రహదారి గుర్తులు సరిగ్గా కనిపించకపోవడం: రాత్రి సమయంలో లేదా వేగంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రహదారి గుర్తులను స్పష్టంగా చూడలేకపోతే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి.

రోజంతా దృష్టిలో హెచ్చుతగ్గులు: ఉదయం బాగానే కనిపించినా, సాయంత్రానికి చూపు మందగించడం లేదా మసకబారడం వంటివి జరిగితే, ఇది కంటి అలసటకు సంకేతం.

ఒక్కసారిగా చూపులో మార్పు: ఒకటి లేదా రెండు కళ్ల చూపులో ఒక్కసారిగా మార్పు వస్తే, ఇది తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు.

కళ్ళు ఎర్రబారడం, మంటలు రావడం: ఎక్కువసేపు కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు వాడడం వలన, కళ్ళు ఎర్రబారడం, మంటలు రావడం వంటి సమస్యలు వస్తాయి.

తలనొప్పి: కంటిపై ఒత్తిడి పడటం వలన తలనొప్పి వస్తుంది.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి. కంటి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరీక్షించడం వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. కంటి పరీక్షలు కేవలం చూపును పరీక్షించడమే కాకుండా, కంటిశుక్లం, గ్లాకోమా వంటి తీవ్రమైన వ్యాధులను కూడా గుర్తించడంలో సహాయపడతాయి. ఆధునిక వైద్య సాంకేతికతతో ఈ వ్యాధులకు సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.

కంటి ఆరోగ్యం కోసం కొన్ని సూచనలు :

ఎక్కువసేపు కంప్యూటర్, మొబైల్ ఫోన్ చూడకుండా ఉండడం. ఇవి ప్రసరించే బ్లూ రేస్ కళ్లకు మంచివి కాదు.
తగినంత నిద్ర పోవడం. ఆకు కూరలు, పండ్లు ఎక్కువగా తినడం. ధూమపానం, మద్యపానం మానేయడం.
కళ్ళను కాపాడుకునేందుకు, కాంతి వడపోత(Screen Filter) కళ్లజోడు ధరించడం.

MOST READ :

  1. Watermelon : పుచ్చకాయ తీసుకుంటున్నారా.. వీటిని చెక్ చేయకపోతే రుచిలేని పండుతో డబ్బులు బొక్క..!

  2. TG News : సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి.. ఏంటి ఈ వ్యాధి.. ఎవరికి వస్తుంది.. అవగాహణ..!

  3. Heart Attack : మీరు రోజూ ఇలా చేయకుంటే.. హార్ట్ ఎటాకే..!

  4. Aeroplane: విమానంలో తీసుకెళ్లే నగదుకి పరిమితులున్నాయా.. ఏవి తీసుకెళ్లొద్దో తెలుసుకుందాం..!

  5. Summer Tours : టూర్ ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్ బడ్జెట్, టాప్ 10 సమ్మర్ టూరిస్ట్ ప్లేసేస్..!

మరిన్ని వార్తలు