TOP STORIESBreaking Newsవ్యవసాయం

Good News : రూ.1500 చెల్లిస్తే లక్ష రూపాయలు.. రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఎప్పుడో..!

Good News : రూ.1500 చెల్లిస్తే లక్ష రూపాయలు.. రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఎప్పుడో..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

రైతులు ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. కేవలం 1500 రూపాయలు చెల్లిస్తే లక్ష రూపాయలు వరకు పొందవచ్చును. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు, కొత్త స్కీములు తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

అలాంటి వాటిలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కూడా ఉంది. ఇది పూర్తిగా ఇన్సూరెన్స్ పథకం.. అంటే పంట బీమా పంటకు నష్టం కలిగితే అప్పుడు పెట్టుబడి పెట్టిన డబ్బులు నష్టం కలగకుండా బీమా డబ్బుల ద్వారా ప్రభుత్వం అన్నదాతకు అందజేస్తుంది. దీనికి ప్రీమియం రైతులు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాలలో రైతుల తరఫున పంటల బీమాకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది.

కానీ ఇప్పుడు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల రైతుల చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల కాలంలో అకాల వర్షాలు రావడంతో పంటలు దెబ్బతింటున్నాయి. దీనివల్ల రైతులు పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా పోయినట్టే అవుతుంది. ఇప్పటికే వ్యవసాయ అధికారులు సమావేశాలు నిర్వహించినప్పటికీ ఫసల్ బీమా యోజన పథకానికి డబ్బులు చెల్లించలేదు. దానికోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

అయితే వరి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, పెసర లాంటి పంటలకు రైతులు ఎక్కువగా పండిస్తున్నందున వరి పంట దెబ్బతింటే హెక్టార్ కు 33 నుంచి 50% వరకు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం లక్ష రూపాయలు చెల్లిస్తుంది. అందుకుగాను కేవలం 1575 చెల్లిస్తే సరిపోతుంది. ఫసల్ బీమా యోజన స్కీమ్ ను అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు