Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : భీష్మరాజ్ ఫౌండేషన్ సేవలు మరింత విస్తృతం..!

Narayanpet : భీష్మరాజ్ ఫౌండేషన్ సేవలు మరింత విస్తృతం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

భీష్మరాజ్ ఫౌండేషన్ సేవలను మరింత విస్తృతం చేస్తామని, వెనకబడిన నారాయణపేట జిల్లాలో విద్యా, వైద్యం అభివృద్ధికి లక్ష్యంగా పనిచేస్తామని ఫౌండేషన్ చైర్మెన్ డా. రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా బృందంచే ముఖా ముఖి నిర్వహించి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముందుగా ఫౌండేషన్ చైర్మన్ కు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు విశ్వవసునామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపేట జిల్లా పరిధిలో ఎంతో మంది పొట్టకూటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారనీ అలాంటి వారిని ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.

ఎంతోమంది చదువుకునే వీలు లేక చదువులో వెనక పడుతున్నారని,అలాగే ఎంతో మంది మెరుగైన వైద్యం అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. అలాంటి వారికోసం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూన్నట్లు ఆయన పేర్కొన్నారు. తమ వెంట ఎలాంటి రాజకీయ పార్టీ లేదని భవిష్యత్తు కార్యాచరణ మాటకు వస్తే సేవ ఒక్కటేనన్నారు.

అనంతరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు నారాయణ పేట జిల్లా అధ్యక్షులు కోయిల్ కొండ నారాయణ రెడ్డి, గణప రఘు, సంజీవ్ ప్రకాష్, హనుమంతు, నక్క శ్రీనివాస్, ఆనంద్ గౌడ్, సులిగం సురేష్, ఎం. రాజేష్, విష్ణు ఆకుల రాజేష్, అంబదాస్, ప్రవీణ్, రమాకాంత్, శ్రీధర్, లింగం, లక్ష్మణ్, యశ్వంత్, కృష్ణ, నర్సింలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బృందం సభ్యులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. CM Revanth Reddy : ఇది మామూలు పథకం కాదు.. దీనిని రద్దు చేసే ధైర్యం ఏ సీఎం చేయలేడు..!

  2. Hyderabad : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపర్ న్యూస్..!

  3. Bank New Rules : బ్యాంకుల కొత్త రూల్స్.. మినిమం బ్యాలెన్స్, విత్ డ్రా పై బాదుడే.. తెలుసుకోకపోతే భారీ నష్టమే..!

  4. Gold Price : ఎవరెస్ట్ ఎక్కిన గోల్డ్ ధర.. తులం ఎంతంటే..!

  5. Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డులపై కీలక అప్డేట్..!

మరిన్ని వార్తలు