Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

అగ్నివీర్ కు సన్మానం..!

అగ్నివీర్ కు సన్మానం..!

కుల్కచర్ల, మన సాక్షి :

ప్రతి ఒక్క యువకులు దేశభక్తిని కలిగి ఉండాలని, స్వయంకృషితో ఉద్యోగం సంపాదించాలని మరియు ఉద్యోగం సంపాదించిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు అన్నారు. బుధవారం కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ హై స్కూల్ 2001 బ్యాచ్ విద్యార్థికి మిలిటరీ (అగ్ని వీర్ ఆర్మీ) కు ఉద్యోగం సాధించినందుకు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ …. విద్యార్థులకు చిన్నప్పటినుండి క్రమశిక్షణ, స్వయంకృషి మరియు సమయపాలన పాటించిన వారు ఏదో ఒక ఉద్యోగం సాధిస్తారని అన్నారు. ప్రస్తుతం ఉన్న యువత బడి మధ్యలో మానివేయడం, దుర అలవాట్లకు అలవాటు పడడం ఈ తరుణంలో అగ్ని వీర్ ఉద్యోగం సాధించి నందుకు గ్రామస్తులు ప్రధానోపాధ్యాయులు చాలా వర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జనార్దన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, సీనియర్ నాయకులు బోయిని కృష్ణయ్య, అంబా దాస్, కాకి గోపాల్, బ్యాగరి శ్రీనివాస్, హనుమంతు , రాములు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది.

MOST READ : 

  1. Aviation : మేక్ ఇన్ ఇండియాకు తోడ్పాటు.. కేంద్ర మంత్రి సమక్షంలో భారీ ఒప్పందం..!

  2. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై.. లంచం ఎంతో తెలుసా..!

  3. Spinach: ఈ ఆహారం.. బట్టతల బాధితులకు వరం..!

  4. Hyderabad : లారీ బీభత్సం.. ట్రాఫిక్ పోలీసుల పైకి దూసుకెళ్లిన లారీ, ఒకరి మృతి..!

  5. Summer Tips : పెరుగా, లస్సీనా.. సమ్మర్‌లో ఏది బెటర్..!

మరిన్ని వార్తలు