TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు.. విచారణ జరపి చర్యలు తీసుకోవాలి..!

Miryalaguda : ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు.. విచారణ జరపి చర్యలు తీసుకోవాలి..!

మన సాక్షి, మిర్యాలగూడ :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరుగుతున్న ఓపెన్ ఇంటర్, ఓపెన్ టెన్త్ పరీక్షల అవకతవకలపై విచారణ జరపాలని ఎం సి పి ఐ యు, అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సెయింట్ మేరీ స్కూల్, బకల్ వాడా ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలో వందలాదిమంది విద్యార్థులు ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారని వారు పేర్కొన్నారు.

కాగా ఆర్థిక స్తోమత లేక పేద, మధ్య తరగతి విద్యార్థులు కూలి కి వెళ్లి పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్లుగా పేర్కొన్నారు. కాగా వారి నుంచి పరీక్షల పేరుతో ఆయా పరీక్ష కేంద్రాలలో ఉన్న ఉపాధ్యాయులు ఒక్కొక్కరి నుంచి 2500 నుంచి 4 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు.

అంతే కాకుండా ఒకరి పరీక్షకు బదులు వేరొకరు పరీక్ష రాస్తున్నారని, జిరాక్స్ పేపర్లు ఇచ్చి ఇళ్లలో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్నారని, అలాంటి వారి వద్ద నుంచి ఐదువేల రూపాయల నుంచి 8 వేల రూపాయలకు వసూలు చేస్తున్నారని వారి పేర్కొన్నారు. నాలుగు పరీక్ష కేంద్రాలలో డబ్బులు వసూలు చేస్తున్న ఉపాధ్యాయులపై సబ్ కలెక్టర్ కు పిర్యాదు చేశారు.

ఈ విషయంపై మండల స్థాయి విద్యాధికారులు పట్టించుకోవడంలేదని, జిల్లా స్థాయి అధికారులు, సబ్ కలెక్టర్ ఈ విషయంపై విచారణ జరపాలని వారు కోరారు. డబ్బులు వసూలు చేస్తున్న ఉపాధ్యాయులపై తక్షణమే సర్వీస్ నుండి తొలగించాలని, కేవలం ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలు డబ్బుల కోసమే నడుపుతున్నట్లుగా మిర్యాలగూడ పట్టణంలో కళ్లకు కట్టినట్లుగా కనపడుతుందని విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకుండా ఉందని వారు పేర్కొన్నారు.

పరీక్షలు సజావుగా జరిగేందుకు డబ్బులు వసూలు చేసిన ఉపాధ్యాయులు వారిపై ఫిర్యాదులు అందకుండా ఎవరెవరికి పంపిణీ చేస్తున్నారనే విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వారిని తక్షణమే సర్వీస్ నుండి తొలగించాలని కోరారు. సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన వారిలో వస్కుల మట్టయ్య, పోతుగంటి కాశి, మచ్చ సైదులు, గడ్డి వీరయ్య, ఏపూరి రవీందర్, వస్కుల కిరణ్, తలకొప్పుల ప్రశాంత్, మంద మల్లేష్ తదితరులు ఉన్నారు.

MOST READ :

  1. SSC : పది ఫలితాల్లో ఆ విద్యార్థిని అరుదైన రికార్డ్..!
  2. Rythu Bharosa : రైతు భరోసా అందని రైతులకు స్పష్టత.. లేటెస్ట్ అప్డేట్..!
  3. Inter Results : ఇంటర్ లో 440 మార్కులకు 434 ఓ విద్యార్థినికి.. కానీ ఏమైందో చూడండి.. (వీడియో)
  4. ATM : ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!
  5. Coolers : కూలర్ కు రూ.15000 చెల్లించాల్సిన అవసరం లేదు.. రూ. 500లకే..!

మరిన్ని వార్తలు