Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు జిల్లా ఎస్పీ

Suryapet : మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు జిల్లా ఎస్పీ

సూర్యాపేట, మనసాక్షి :

పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించిన సందర్భంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దు అని జిల్లా ఎస్పీ కె.నరసింహ కోరారు. మైనర్స్ కు వాహనాలు ఇస్తే తల్లిదండ్రుల పై, వాహన యజమానులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.

గత కొద్ది రోజులుగా మైనర్ పిల్లలు ద్విచక్ర వాహనాలు నడుపుతూ పోలీసు తనిఖీల్లో పట్టుబడుతున్నారని, పట్టుబడ్డవారికి జరిమానాలు విధిస్తూ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాము అన్నారు. కేసులు నమోదు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల వారు అజాగ్రత్తగా అతివేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడతారు అలాగే ఇతరులకు ప్రమాదాన్ని కలగజేస్తారు కావున పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. రోడ్డు భద్రత చర్యలు ప్రతిఒక్కరూ పాటించాలని కోరారు. యువత అడ్డగోలుగా వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల బారినపడి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దుఃఖం కలిగించవద్దున్నారు. పోలీసు జరిమానాలు విధించడం భద్రత చర్యల్లో భాగమని, మార్పుకోసమే అని తెలిపారు. వాహనదారులు నిభందనలు ఉల్లంఘించి ఒక సారి జరిమానా కు గురైతే మళ్ళీ అలాంటి తప్పులు చేయవద్దు అని కోరారు.

MOST READ : 

  1. Narayanpet : ఇసుక రవాణాకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  2. District collector : సారూ.. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటాం.. జిల్లా కలెక్టర్ ను వేడుకున్న నిరుపేద..!

  3. Gold Price : పడిపోయిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. ఎంతంటే..!

  4. Big Alert : ఈ పేరుతో ఫోన్ కాల్స్, వాట్సప్ మెసేజ్ లు వస్తే జాగ్రత్త.. లేదంటే మీ ఖాతా ఖాళీ..!

మరిన్ని వార్తలు