After 21 Years : 21 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు..!
After 21 Years : 21 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు..!
శాలిగౌరారం, మనసాక్షి:
శాలిగౌరారం మండల కేంద్రంలోని విజ్ఞాన జ్యోతి హైస్కూల్ లో 2003-04 సంవత్సరం లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు 21 సంవత్సరాల కలుసు కొని ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు.
ఆదివారం శాలిగౌరారం లోని జిబిఎం ఫంక్షన్ హాల్లో ఎంతో ఉత్సాహంగా గురువులను ఆహ్వానించి అపూర్వంగా ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు.వివిధ ప్రాంతాల్లో స్థిరపడి చాలా రోజుల తరువాత వారు కలుసుకోవడం తో వారి ఆనందానికి అవధులు లేవు.
ఒకరనినొకరు ఆప్యాయతగా పలకరించుకొని చిన్న నాటి మనోభావాలను,జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.ఆత్మీయ సమ్మేళన సమావేశం గురువులను ఘనంగా శాలువాల తో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమం లో హెచ్ ఎం బుడిగె శ్రీనివాసులు, ఉపాధ్యాయులు కొయ్యడ శివశంకర్, పడాల అంతయ్య, కొడవటికంటి సుబ్రమణ్య శర్మ, మద్ది శశిధర్ రెడ్డి, చెవుగోని సత్యనారాయణ, యేశబోయిన అంజయ్య, వేముల సోమయ్య,
ఖాజా మోహినుద్దీన్, మర్రి వెంకన్న, మద్ది అరుణ పూర్వ విద్యార్థులు కల్లూరి మల్లేష్, చెవుగాని సుధాకర్, కందుకూరి రాజేంద్రప్రసాద్, యంపల్ల ప్రవీణ్ రెడ్డి, కాగితాల నాగరాజు, నీలగిరి వెంకన్న, పడాల శ్రీనివాస్, ప్రమోదిని, స్వాతి పాల్గొన్నారు.
MOST READ :
-
Narayanpet : ఇసుక రవాణాకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
TG News : తెలంగాణకు చల్లని కబురు.. మొదలైన చల్లటి గాలులు.. జిల్లాలకు అలర్ట్..!
-
Gold Price : పడిపోయిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. ఎంతంటే..!
-
Big Alert : ఈ పేరుతో ఫోన్ కాల్స్, వాట్సప్ మెసేజ్ లు వస్తే జాగ్రత్త.. లేదంటే మీ ఖాతా ఖాళీ..!
-
Video call : రిటైర్డ్ ఉద్యోగినికి వీడియో కాల్.. రూ. 30 లక్షలు కొట్టేశారు..!









