Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో అలకరించిన మంగ్లీ మ్యూజికల్ నైట్..!

Miryalaguda : మిర్యాలగూడలో అలకరించిన మంగ్లీ మ్యూజికల్ నైట్..!

ఘనంగా బిఎల్ఆర్ పుట్టినరోజు వేడుకలు

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ లో ఆదివారం బీ ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ సింగర్ మంగ్లీ సౌండ్స్ ఆఫ్ మంగ్లీ లైవ్ ఇన్ కాన్సెప్ట్ సాంస్కృతి కార్యక్రమం మ్యూజికల్ నైట్ అలకరించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎంఎస్పి క్యాంపులో జరిగిన కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు.

కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి దంపతులకు ఘనంగా సన్మానం చేశారు. నల్లగొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి , శాగ జలంధర్ రెడ్డి, రుణాల్ రెడ్డి, బంటు లక్ష్మీనారాయణ, గోదాల జానకి రామ్ రెడ్డి, గుండు నరేందర్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి 

————————


మరిన్ని వార్తలు