తెలంగాణBreaking Newsకామారెడ్డి జిల్లాక్రైంజిల్లా వార్తలు

Jawan : విధి నిర్వహణలో లో జవాన్ మృతి.. ఆయన ప్రాణత్యాగం వెలకట్టలేనిది..!

Jawan : విధి నిర్వహణలో లో జవాన్ మృతి.. ఆయన ప్రాణత్యాగం వెలకట్టలేనిది..!

కామారెడ్డి జిల్లా, మన సాక్షి:

విధి నిర్వహణలో మరణించిన జవాన్ వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని, ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు.

పాల్వంచ మండల కేంద్రానికి చెందిన మృతుడు గ్రేహాండ్స్ కానిస్టేబుల్ జవాన్ వడ్ల శ్రీధర్ ,స్వగృహం వద్ద ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి.మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చి అంత్యక్రియల్లో శుక్రవారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ , జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ మాట్లాడుతూ మూలుగు జిల్లాలోని వాజేడు ప్రాంతంలో ఆపరేషన్ కాగార్ లో భాగంగా వాజేడు ప్రాంతంలోని కుబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్, పేలుడులో
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్
వడ్ల శ్రీధర్ త్యాగం వెలకట్టలేనిదాని, వీర జవాన్ల సేవలు దేశానికి గర్వకారణమని, ప్రభుత్వపరంగా అన్ని విధాల ,మృతి చెందిన జవాన్
కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు.

మావోయిస్టులు చర్చల ద్వారా సమస్యలు పరిస్కరించుకోవాలని, హింసా మార్గాన్ని విడనాడాలని కోరారు. మృతుడు జవాన్ వడ్ల శ్రీధర్ కుటుంబానికి 2.17 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అంద జేస్తుందని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తో పాటు 300 గజాల ఇంటి స్థలాన్ని అందించి వారిని ఆదుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పోలీసు లాంఛనాలతో వీర జవాన్ అంత్యక్రియలు జరిపారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు,జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ గ్రేహ్యాండ్ కమాండర్ ఆపరేషన్ రాఘవెందర్ రెడ్డి, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవిన్యూ వి.విక్టర్, ఆర్డీఓ వీణ, పోలీసు, రెవిన్యూ, అధికారులు, సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. బావిలో ఈతకు వెళ్లిన ఇద్దరు మృతి..!

  2. Gold Price : భారీగా తగ్గిన గోల్డ్.. కొనుగోలుకు ఇదే మంచి ఛాయిస్..!

  3. Rythu : రైతులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. ఇకపై వారికి కూడా ఖాతాలలో డబ్బులు..!

  4. Fish : వాహ్.. సూపర్ మచ్చి.. జాలరీ కి చిక్కిన ఆరుదైన చేప…!

మరిన్ని వార్తలు