తెలంగాణBreaking Newsజయశంకర్ భూపాలపల్లి జిల్లాజిల్లా వార్తలు

TG News : ధాన్యం బస్తాలో డబ్బులు దాచిన రైతు.. భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్..!

TG News : ధాన్యం బస్తాలో డబ్బులు దాచిన రైతు.. భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కొన్ని విషయాలు భార్యకు తెలియకుండా భర్త.. భర్తకు తెలియకుండా భార్య గోప్యంగా ఉంచుతుంటారు. అలాంటి విషయంలో కొన్ని పొరపాట్లు కూడా జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటన ఒకటి తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ కు చెందిన రైతు వీరయ్య అనే కొద్ది రోజుల క్రితం తన ఎడ్లను విక్రయించాడు. దాంతో అతడికి 1.50 లక్షల రూపాయలు వచ్చాయి. అయితే ఆ డబ్బులను ఇంట్లో ఉన్న దాన్యం బస్తాలో తయారు చేశాడు. అది అతని భార్యకు చెప్పలేదు.

కాగా అతడు ఏదో పని కోసం బయటకు వెళ్ళాడు. ఆ సమయంలో ఆ గ్రామానికి వాహనంలో ఒక వ్యాపారి వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నాడు. వీరయ్య భార్య ఇంట్లో చిల్లర అవసరాల కోసం దాన్యం విక్రయించాలని అనుకుంది. అయితే రైతు వీరయ్య డబ్బులు దాచిన బస్తాని వ్యాపారికి విక్రయించింది.

వీరయ్య ఇంటికి తిరిగి వచ్చి ధాన్యం బస్తా లేకపోవడంతో భార్యను అడిగాడు అయితే ఆమె చిల్లర అవసరాల కోసం ఆ బస్తా ధాన్యాన్ని విక్రయించినట్లు చెప్పింది. కాగా ఆ బస్తాలో డబ్బులు దాచినట్లుగా చెప్పాడు. వెంటనే ఆ వ్యాపారి కోసం గాలించారు. కాగా అతని ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ వ్యాపారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

  2. Aadabidda Nidhi : ప్రతి మహిళకు నెలకు రూ.1500.. డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలోకి.. వెంటనే దరఖాస్తు చేయండి..!

  3. Accident : తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాదం.. ఢీకొన్న బస్సు, జీపు..!

  4. TG News : తెలంగాణలో కొత్త పథకం.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!

  5. Health : ఆరోగ్యంగా ఉన్న వారిలో సగం మందికి గుండెపోటు ముప్పు.. నివారించుకోవచ్చా తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు