Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

SI : చింతపల్లి నూతన సబ్ ఇన్స్పెక్టర్ ఎవరో తెలుసా..! 

SI : చింతపల్లి నూతన సబ్ ఇన్స్పెక్టర్ ఎవరో తెలుసా..! 

చింతపల్లి, మన సాక్షి..

చింతపల్లి మండల నూతన సబన్స్పెక్టర్ గా ఎం. రామ్మూర్తి సోమవారం విధుల్లో చేరారు. ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గా బీనమోని యాదయ్య 16 నెలలకు పైగా విధులు నిర్వర్తించి బదిలీపై హైదరాబాదులోని డి జి పి కార్యాలయానికి వెళ్లారు. కొండ మల్లెపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించిన సబ్ ఇన్స్పెక్టర్ ఎం.రామ్మూర్తి చింతపల్లి మండలానికి బదిలీపై విచ్చేశారు.

ఈ సందర్భంగా విధుల్లో నూతన సబ్ ఇన్స్పెక్టర్ ఎం. రామ్మూర్తి మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలను అరికడతామన్నారు. మండలంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుబడతాయన్నారు.

గ్రామాలలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరించినట్లయితే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. ఈ సందర్భంగా విధుల్లో చేరిన ఎస్సై ఎం.రామ్మూర్తికి పలు సంఘాల నాయకులు పోలీస్ సిబ్బంది వారికి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

MOST READ :

మరిన్ని వార్తలు