Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsహైదరాబాద్

BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్ (07/06/2025)..!

BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్ (07/06/2025)..!

మనసాక్షి, వెబ్ డెస్క్:

మన సాక్షి పత్రిక తాజా వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తుంది. లేటెస్ట్ న్యూస్ కోసం మన సాక్షి వెబ్సైట్లో ఫాలో అవ్వండి. శనివారం జూన్ 7వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు టాప్ ఫైవ్ బ్రేకింగ్ న్యూస్ మీకోసం…

———- ——
ఈటెలకు మంత్రి తుమ్మల బిగ్ కౌంటర్

బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బిగ్ కౌంటర్ ఇచ్చారు. ఈటెల రాజేందర్ కాలేశ్వరం కమిషన్ ఎదుట అసత్య వాంగ్మూలం చెప్పారని శనివారం సచివాలయంలో తుమ్మల విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. తాను సుమోటోగా సబ్ కమిటీ విషయాలు కమిషన్ ముందు ఉంచుతా అని పేర్కొన్నారు. సబ్ కమిటీకి కాళేశ్వరం కు ఎలాంటి సంబంధం లేదని, సబ్ కమిటీ కేవలం పెండింగ్ ప్రాజెక్టులపై ఏర్పాటు చేసింది అని ఆయన పేర్కొన్నారు.

———– ——

మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ :

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం మంత్రివర్గ విస్తరణ పూర్తిగా ఏర్పాటయ్యే అవకాశం. మంత్రివర్గంలో కొత్తవారికి ముగ్గురికి అవకాశం కల్పించనున్నారు.

———— —–

చత్తీస్గడ్ లో భారీ ఎన్కౌంటర్ :

ఛత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లలో శనివారం మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఏకే 47 గన్ తో పాటు భారీగా మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది.

———— —–

కాలేశ్వరం పై సిబిఐ దర్యాప్తు జరగాలి

కాళేశ్వరం పై సిబిఐ దర్యాప్తు జరగాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్ తప్పు చేయలేదు కాబట్టే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కమిషన్ కు భయపడి హాజరు కావడం లేదన్నారు. ఈటెలకు తెలిసిందే కమిషన్ ముందు చెప్పారు అని ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు పగుళ్లు అయింది నిజం కాదా..? అని పేర్కొన్నారు. బనకచర్ల విషయంలో కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

——— ———

కాలేశ్వరం కమిషన్ భయపడతామా..?

ప్రాణత్యాగాలకు సిద్ధపడిన వాళ్ళము.. కాలేశ్వరం కమిషన్ కు భయపడతామా అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఎన్ డి ఎస్ ఏ బీజేపీకి జేబు సంస్థలా మారిందని విమర్శించారు. ఆర్థిక మంత్రికి సంబంధం లేదు అనడం సరైనది కాదన్నారు.

MOST READ : 

  1. Cm Revanth Reddy : దయ్యాల రాజ్య సమితి..!

  2. New Scheme : మహిళలకు తీపి కబురు.. వారికోసం మరో కొత్త పథకం..!

  3. Farmers : రైతులకు భారీ గుడ్ న్యూస్.. గిట్టుబాటు ధరలకు చర్యలు.. బిగ్ అప్డేట్..!

  4. Rythu Bharosa : వారికే ఒకేసారి రైతు భరోసా.. ఎప్పుడో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు