Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి.. చావు బతుకుల మధ్య తల్లి..!

Nalgonda : ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి.. చావు బతుకుల మధ్య తల్లి..!

డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ధర్నా

నల్లగొండ , మనసాక్షి ;

ప్రసవం కోసం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి వచ్చిన తల్లి చావు బతుకులో ఉండడం శిశువు మరణించడంతో దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ కుటుంబ సభ్యులు బంధువులు లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం..

గుడిపల్లి మండలం కేశినేని తండాకు చెందిన జటావత్ ఝాన్సీ మొదటి కాన్పు కోసం ఈనెల 6 వ తేదీన ఆసుపత్రులో అడ్మిట్ అయింది. అయితే ఆమెకు ప్రధమ చికిత్సనందిస్తున్న క్రమంలో గురువారం పురిటినొప్పులు రావడంతో పరిశీలించిన డాక్టర్లు స్కానింగ్ రాసి అనంతరం పరిశీలించగా కడుపులోని పాప చనిపోయిందని నిర్ధారించారు. మృత శిశువును డాక్టర్లు డెలివరీ చేశారు.

అనంతరం తల్లి పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి రె ఫర్ చేశారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావుబతుకులో ఉంది శిశువుమృతికి ప్రభుత్వం డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని వైద్యం వికటించి చనిపోయారని ఆరోపిస్థి సాదరు మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బంధువులకు నచ్చజెప్పిన వినకపోవడంతో ఆర్డీవో అశోక్ రెడ్డి ఆందోళనకారుల వద్దకు వచ్చి ప్రభుత్వపరంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు .

MOST READ :

  1. Plane Crash : విమానం నుంచి నేను దూకలేదు.. నేను ఎలా బ్రతికాను..!

  2. TG News : ముగ్గురు మంత్రులు అవుట్.. వారి స్థానంలో మరో ముగ్గురు..!

  3. RDO : ఆర్డీఓ కీలక సూచన.. రేషన్ షాప్.. ఆర్డిఓ ఆకస్మిక తనిఖీ..!

  4. Miryalaguda : జ్యోతి హాస్పిటల్ లో మహిళ మృతి.. బంధువుల ఆందోళన, ఫర్నిచర్ ధ్వంసం..!

  5. Air India plane Crash : గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం.. కుప్ప కూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్..!

మరిన్ని వార్తలు