Nalgonda : నల్గొండలో నలుగురు కుటుంబ సభ్యుల హత్య కేసులో వీడిన మిస్టరీ..!
నల్గొండలో సంచలనం కలిగించిన నలుగురు కుటుంబ సభ్యుల హత్య కేసు మిస్టరీ వీడింది.

Nalgonda : నల్గొండలో నలుగురు కుటుంబ సభ్యుల హత్య కేసులో వీడిన మిస్టరీ..!
మన సాక్షి, నల్గొండ ప్రతినిధి :
నల్గొండలో సంచలనం కలిగించిన నలుగురు కుటుంబ సభ్యుల హత్య కేసు మిస్టరీ వీడింది. పోలీసులు మొదట్లో నలుగురువి హత్యలా..? ఆత్మహత్యనా..? అని భావించినప్పటికీ చివరికి హత్యగా తేల్చారు. ఈ సంఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు సుల్తాన్ (40), హజీనా(45), కుమారుడు ముజిబుల్(21), కూతురు అపోరా(12) ఉంది. సుల్తాన్ నల్గొండ లోని ప్రకాశం బజార్ లో బ్యాగుల వ్యాపారం నిర్వహిస్తుండగా హసీనా ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది.
సుఫారీ హత్య.. చేయించింది కూతురే :
ఈ నలుగురి హత్యలో సుఫారీ హత్యగా చేయించింది కూతురే అని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. హసీనా మొదటి భర్త కూతురు బుష బుటాని సుఫారీ హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. 150 గజాల ప్లాటు బంగారం కోసమే ఈ హత్య చేయించినట్లు తెలుస్తోంది. బుషా బూటని ఆటో డ్రైవర్ ను ప్రేమించి వివాహం చేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన రౌడీ షీటర్లకు లక్ష రూపాయల సఫారీకి ఒప్పుకొని వారికి డబ్బులు చెల్లించినట్లు సమాచారం. హత్యకు కారణమైన ఆరుగురు రౌడీ షీటర్లను, కూతురు అల్లుడులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. సంఘటనా స్థలం నుంచి సేకరించిన ఆధారాలు, సిసి పుటేజీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.









