Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణ

Rythu Bharosa : రైతు భరోసా పై బిగ్ అప్డేట్.. ఈ పత్రాలు తప్పనిసరి..!

Rythu Bharosa : రైతు భరోసా పై బిగ్ అప్డేట్.. ఈ పత్రాలు తప్పనిసరి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా పంటలు సాగు చేస్తున్న రైతులకు ఎకరానికి ఏడాదికి 12,000 రూపాయలను ప్రభుత్వం అందజేయనున్నది. రెండు విడుదలగా 12 వేల రూపాయలను ఒక్కొక్క విడతకు ఆరు వేల రూపాయల చొప్పున అందజేయనున్నారు.

యాసంగి సీజన్ కు సంబంధించి ఇప్పటివరకు నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు వారి వారి ఖాతాలో జమ చేశారు. ఇంకా నాలుగు ఎకరాల పైగా ఉన్న రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉండగా వానకాలం సీజన్ కూడా వచ్చింది. కాగా రైతు భరోసా పథకంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కీలక ప్రకటన చేశారు. వానాకాలం సీజన్ లో వరి నాట్లు వేసే లోపే రైతులకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఇది ఇలా ఉండగా రైతు భరోసా కు కొత్తగా దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు వానాకాలం రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చును. అందుకుగాను పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు, జిరాక్స్ ప్రతులను వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాల్సి ఉంది.

దాంతో పాటు గతంలో రైతు భరోసా పొందుతున్న రైతులు బ్యాంకు ఖాతాను మార్చుకోవాలి అనుకుంటే కూడా సంబంధిత పత్రాలను వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాల్సి ఉంది. కాగా రైతు భరోసా పథకం పొందుతున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని వ్యవసాయ అధికారులు స్పష్టం చేశారు.

MOST READ :

  1. Paddy : పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ..  రైతులను ఆకర్షిస్తున్న మెట్టవరి సేద్యం..!

  2. Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తుల స్వీకరణ.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Nalgonda : చదివింది ఏడవ తరగతి.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్టు ఆఫీసర్.. రూ. 17 లక్షలతో పరార్..!

  4. Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తుల స్వీకరణ.. లేటెస్ట్ అప్డేట్..!

  5. WhatsApp : ఇక వాట్సాప్ కు శుభం కార్డేనా.. ఈ విషయం తెలిస్తే షాక్..!

మరిన్ని వార్తలు