Indiramma Indlu : ఇందిరమ్మ ఇల్లు రాలేదని వినూత్న నిరసన..!
Indiramma Indlu : ఇందిరమ్మ ఇల్లు రాలేదని వినూత్న నిరసన..!
ఆత్మకూరు ఎస్, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏనుభాముల గ్రామంలో ఇందిరమ్మలు రాలేదని ఓ బాధితుడు వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఏనుబాముల గ్రామనికి చెందిన కలకోట్ల పాండు రంగన్న శనివారం గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎదుట తాటి కమ్మలతో గుడిసె వేసి తన భార్య పిల్లలతో వినూత్న నిరసన వ్యక్తం చేశాడు. ఇటీవల మంజూరు అయిన 33మంది ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆవేదన చెందాడు.
కూలీ పనులు చేసుకునే తమ కుటుంబానికి ముఖ్యమంత్రి స్పందించి తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్లే కార్డు ద్వారా డిమాండ్ చేశాడు.అంతకు ముందు ఎన్నో రోజులుగా ఇల్లు కోసం గ్రామ నాయకులు, అధికారుల చుట్టూ తీరగానని, వారంతా ఇల్లు ఇప్పిస్తామని తీరా జాబితాలో పేరు రాకుండా చేశారని ఆరోపించారు. ఎంపీవో రాజేష్ మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీ నిర్ణయం మేరకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు.. డేట్ ఫిక్స్.. ఆ రోజు పండుగే.. బిగ్ అప్డేట్..!
-
Manchu Lakshmi : దేవుడి దయవల్ల విమాన ప్రమాదం నుంచి బయటపడ్డా.. మంచులక్ష్మి వీడియో..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై బిగ్ అప్డేట్.. ఈ పత్రాలు తప్పనిసరి..!
-
Rythu Bharosa : రైతు భరోసాకు నిబంధనలు.. మంత్రి తుమ్మల స్పష్టం.. విడుదలకు డేట్ ఫిక్స్..!









