Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవైద్యంసూర్యాపేట జిల్లా

Enquiry : వైద్యాధికారి, ఏఎన్ఎంలు పోటాపోటీగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు.. డిప్యూటీ డి ఎం హెచ్ ఓ దర్యాప్తు..!

Enquiry : వైద్యాధికారి, ఏఎన్ఎంలు పోటాపోటీగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు.. డిప్యూటీ డి ఎం హెచ్ ఓ దర్యాప్తు..!

పెన్ పహాడ్, మన సాక్షి:

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్లె దోవకానాల విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం లు మే 28న సూర్యాపేట జిల్లా వైద్యాధికారికి డి ఎం హెచ్ ఓ కు,, ఏఎన్ఎం లు పలు ఆరోపణతో కూడిన వినతి పత్రం మండల వైద్యాధికారి స్రవంతి పై సమర్పించినారు. పెన్ పహాడ్ మండల వైద్యాధికారి స్రవంతి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కు జూన్ 3 వ తారీఖున ఏఎన్ఎం పై విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, రికార్డులు సరిగా రాయడం లేదని, పలు ఆరోపణలతో కూడిన వినతి పత్రం కలెక్టర్ కు సమర్పించినారు.

ఇరువురి ఫిర్యాదులపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూర్యాపేట జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు సూర్యాపేట డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ,కోటిరత్నం మంగళవారం దర్యాప్తు చేపట్టినారు.

నిధులు దుర్వినియోగం అయినాయి అనే ఆరోపణపై ఎం ఎల్ హెచ్ పి ద్వారా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటామని నిధుల ఖర్చు విషయంలో తీర్మానం చేసిన పత్రాలను జిరాక్స్లను తీసుకుంటామని ఇరువురి ఫిర్యాదులలో పలు ఆరోపణలపై పూర్తి విచారణ తర్వాత డిఎంహెచ్వో ద్వారా సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కు అందజేస్తామని విజిలెన్స్ అధికారుల ద్వారా కూడా దర్యాప్తు జరుగుతుందని ఆమె అన్నారు.

డిప్యూటీ డి ఎం హెచ్ ఓ కోటిరత్నం పత్రిక విలేకరులతో మాట్లాడుతూ జూన్ 16 నుండి జూలై 31 వరకు డయోరియా మీద పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శుభ్రత పై పలు సూచనలు ఇవ్వనున్నట్లు. అంగన్వాడీలు ఆశా వర్కర్లు విద్యార్థుల కు ఓఆర్ఎస్ పాకిట్లు అందించాలని విద్యార్థులు చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవడంపై అవగాహన కల్పించాలని ఆమె అన్నారు.

బిడ్డకు తల్లిపాలు మాత్రమే శ్రేయస్కరమని ఆరు నెలలు తప్పకుండా తల్లి పాలు ఇవ్వాలని ఆమె సూచించారు. అంగన్వాడీలలో విద్యార్థులకు మంచి పోషక ఆహారాలు అందించాలని మంచి నీటిని పిల్లలు త్రాగేటప్పుడు పలు జాగ్రత్తలతో ఉండాలని ఆమె సూచించారు.

MOST READ :

  1. Suryapet : మున్సిపల్ సానిటరీ సిబ్బంది ఆకస్మిక తనిఖీ.. ఎల్ఎస్ బేకరీ కి రూ. 5000 జరిమానా..!

  2. District Collector : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఇండ్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో భారీ మార్పులు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!

  4. WhatsApp : వాట్సప్ సంచలన నిర్ణయం.. ఇక సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు.. తెలుసుకోండి..!

  5. Mahalakshmi : తెలంగాణలో మహిళలకు నెలకు రూ.2500.. వారే అర్హులు.. ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు