Miryalaguda : అధ్వానంగా సాగర్ ఎడమ కాలువ.. నీరు పారేదెలా..!
Miryalaguda : అధ్వానంగా సాగర్ ఎడమ కాలువ.. నీరు పారేదెలా..!
– కాల్వ కట్టలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఎం బృందం
మిర్యాలగూడ, మన సాక్షి:
అయ్యా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి.. ఎడమ కాలువల దుస్థితి ఒక్క సారి అధికారులతో కలిసి పరిశీలించండి.. కాలువ కట్టలకు లైనింగ్ లేక కోతలకు గురవుతున్నాయి… అనేక చోట్ల బొంగలు పడి గండి పడే ప్రమాదంగా ఉన్నాయి… ఈ వానాకాలం సీజన్ లో నీటిని విడుదల చేస్తే కాల్వ కట్టలు తెగి పంట పొలాలతో పాటు అనేక గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంది.
ఆయకట్టు ప్రాంతానికి చెందిన వారిగా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న మీరు నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి ఒకసారి కాల్వ కట్టలను పరిశీలించండి.. మరమ్మతులకు నోచుకోక బలహీనంగా ఉన్న కాల్వ కట్టలు మీకు కనబడతాయి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.
బుధవారం సిపిఎం బృందం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని దొండ వారి గూడెం బ్రిడ్జి మైల్ 41 వద్ద కోతలకు గురవుతున్న కాల్వ కట్టలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఎడమ కాల్వ సాగర్ నుండి ఖమ్మం జిల్లా పాలేరు వరకు 179 కిలోమీటర్ల విస్తరించి ఉందని తెలిపారు.
గతంలో ఎడమ కాలువ కట్టలకు లైనింగ్ ఏర్పాటు చేశారని అక్కడక్కడ సీసీ లైనింగ్ ఏర్పాటు చేయకుండా వదిలేశారని ఆరోపించారు. ప్రతి 10 నుంచి 15 కిలోమీటర్ల లోపు అనేక చోట్ల కాల్వ కట్టలు బలహీనంగా ఉండి కోతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వ కట్టలు పూర్తిగా తెగిపోయే పరిస్థితి నెలకొందని తెలిపారు.

ప్రస్తుత వానకాలం సీజన్ రాబోతుందని ఆగస్టులో సాగునీరు విడుదల చేస్తే ఆ వరదలకు కాలువ కట్టలు పూర్తిగా తెగే అవకాశం ఉందని చెప్పారు. దీనివలన పంట పొలాలతో పాటు అనేక గ్రామాలు నీటిలో మునుగుతాయని తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమ కాలవ కింద కిష్టాపురం, వజిరాబాద్, ముది మాణిక్యం, ములకల కాలువ, జాన్ పాడ్, మేజర్లు ఉన్నాయని ఎన్నో ఏళ్లుగా మరుమత్తులకు నోచుకోవడం లేదన్నారు.
ఇటీవల కాలంలో సాగునీటి ప్రాజెక్టులపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబంధిత అధికారులతో మిర్యాలగూడలో సమావేశం జరిపిన ఉత్తంకుమార్ రెడ్డి కాల్వకట్టల మరమ్మత్తుల కోసం నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కాలువలో మరమత్తులకు త్వరలో నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారని కానీ ఇప్పటివరకు నిధులు మంజూరు చేయకపోవడంతో కాలువ కట్టలు దుర్భరంగా ఉన్నాయని తెలిపారు.
సాగునీరు విడుదల చేసేందుకు మరో నెల 15 రోజులు గడువు ఉందని ఆలోపు కాలువ కట్టలకు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సిపిఎం మండల కార్యదర్శి రవి నాయక్, రైతు సంఘం జిల్లా నాయకులు పాదూరీ శశిధర్ రెడ్డి, జిల్లా నాయకులు డా మల్లు గౌతమ్ రెడ్డి, నాయకులు బొగ్గరపు కృష్ణయ్య, రేమిడాల బిక్షం, వలమల్ల ఎల్లయ్య తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా.. ఆ రైతులకు డబుల్ బోనంజా.. లేటెస్ట్ అప్డేట్..!
-
District collector : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపు మెగా జాబ్ మేళా.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో భారీ మార్పులు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!
-
Mahalakshmi : తెలంగాణలో మహిళలకు నెలకు రూ.2500.. వారే అర్హులు.. ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!
-
WhatsApp : వాట్సప్ సంచలన నిర్ణయం.. ఇక సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు.. తెలుసుకోండి..!









