Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంసూర్యాపేట జిల్లా

TG News : ప్రారంభమైన ఆదివాసీ బునియాది కార్యకర్తల శిక్షణ..!

TG News : ప్రారంభమైన ఆదివాసీ బునియాది కార్యకర్తల శిక్షణ..!

సూర్యాపేట, మనసాక్షి

బిజెపి, ఆర్ఎస్ఎస్ లు దేశంలో మనువాద సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అనచివేతకు పాల్పడుతున్నారని డోర్నకల్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్ అన్నారు.

మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణరెడ్డి సహకారంతో మాజీ ఎంపిపి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ థరావత్ వీరన్న నాయక్ అధ్యక్షతన జరుగుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ఆదివాసి బునియాది కార్యకర్తల శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు‌.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బిజెపి ఆర్ఎస్ఎస్ లు మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నాయని ప్రజల మధ్య చిచ్చు పెట్టి విభజించే విధానాన్ని అవలంబిస్తున్నాయని అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని వర్గాలను సమానంగా ఆదరిస్తుందని, దళితులకు మైనార్టీలకు ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీలోనే రక్షణ లభిస్తుందని అన్నారు.

ఆదివాసీల భూములను వారికి అప్పగించే విధంగా కాంగ్రెస్ పార్టీ అనేక చట్టాలను తీసుకొని వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతం అని ఇందిరాగాంధీ గరీబి హటావో నినాదంతో పాటుగా భూసంస్కరణ చట్టం తీసుకువచ్చి లక్షలాది ఎకరాలని పేదలకు పంచారని ఆయన అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ఈనాడు దేశాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రపంచంలో నాలుగవ ఆర్ధిక శక్తిగా నిలబడడటానికి తోడ్పడ్డాయని అన్నారు.

మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో హయాంలో ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టము, భూసేకరణ నియంత్రణ చట్టం లాంటి చట్టాలను తీసుకొని వచ్చి పేదలకు రక్షణ కల్పించారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే రాజ్యాంగ పరిరక్షణ కోసం పాల్పడుతుందని రాజ్యాంగ పరిరక్షణ కోసమే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా 4400 కిమీ భారత్ జోడో చేపట్టారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుతూ సామాజిక సమైక్యతను దేశ సమగ్రతను కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ జయంతి ని ప్రభుత్వ సెలవుగా గుర్తించిందని, రాష్ట్రంలో నలుగురు ఎస్పీలు ఎస్టీలని, ట్రైకారగ చైర్మన్ తో పాటు కార్యదర్శి కూడా ఎస్టీలని, సింగరేణి ఎండిగా ఎస్టీకి చెందిన వ్యక్తిని నియమించారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పరిరక్షణకు కృషి చేస్తుందని కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆదివాసీ బంజారా బిడ్డలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను తెలుసుకోవాలని అందుకోసమే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని ఇప్పటికే ఐదు జిల్లాలలో ఈ శిక్షణ పూర్తి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.

ఈ జై బాపు జై భీమ్ జై జగత్ సిద్ధాంతాలే మనకి ఆధారమని కాంగ్రెస్ పార్టీ భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ అని, అహుంసా మార్గంలో మహాత్మా గాంధీ స్వతంత్ర సాధనకు కృషి చేశారని రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగ రచనకు అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీని నియమించిందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోటియా నాయక్ భూక్యా, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, ప్రోగ్రామ్ ఇంచార్జీ లింగం నాయక్, బాబు నాయక్, నాగేశ్వర్ నాయక్, శ్రీను, మల్లికార్జున్, శివ నాయక్, ధరవాత్ వీరన్న పలువురు బంజారా ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతితులు, నాయకులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Transfers : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..!

  2. Gold Price : తగ్గిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. యుద్ధం వల్లనేనా..!

  3. Indiramma Indlu : అర్హులకు దక్కని ఇందిరమ్మ ఇండ్లు..!

  4. Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. లక్కీ డ్రా పేరుతో రూ.3.90 కోట్లు స్వాహా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!

  5. TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్..!

మరిన్ని వార్తలు