తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలునిర్మల జిల్లా

ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..!

ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..!

మన సాక్షి, నిర్మల్ :

లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో గొడిసెర్యాల గ్రామంలో గ్రామపంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాటర్ ప్లాంట్ ఎన్ఓసీ కోసం గ్రామ కార్యదర్శి శివకృష్ణను సంప్రదించాడు. దాంతో అతడు ఎన్ఓసి ఇవ్వడానికి 15000 రూపాయలు డిమాండ్ చేశాడు.

కాగా 12 వేల రూపాయలు ఇవ్వడానికి అతడు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఏ సి బి అధికారులను సంప్రదించిన అతడు వారి సూచనల మేరకు 12 వేల రూపాయలను పంచాయతీ కార్యదర్శి కి ఇస్తుండగా ఏసీబీ డిఎస్పి మధు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దాంతో వెంటనే పంచాయతీ కార్యదర్శి శివకృష్ణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

MOST READ : 

  1. Students : ఇంటర్ చదివే విద్యార్థులు.. లక్షల రూపాయలు వారికి ఎక్కడివి.. కట్ చేస్తే పోలీసుల అదుపులో..!

  2. Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. లక్కీ డ్రా పేరుతో రూ.3.90 కోట్లు స్వాహా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!

  3. CM Revanth Reddy : స్థానిక సంస్థల ఎన్నికల అప్డేట్.. సీఎం రేవంత్ రెడ్డి వారికి వార్నింగ్..!

  4. Ration Cards : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై వారికి రేషన్ కట్..!

  5. TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా.. షెడ్యూల్ ఎప్పుడంటే..!

మరిన్ని వార్తలు