క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
ACB : సూర్యాపేట జిల్లాలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగి..!
ACB : సూర్యాపేట జిల్లాలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగి..!
హుజూర్ నగర్, (మనసాక్షి):
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి బట్టబయలైంది. మ్యుటేషన్ పత్రాల జారీ కోసం రూ.12,000 లంచం డిమాండ్ చేస్తూ డేటాఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కర్నాటి విజేత రెడ్డి ACB అధికారులకు అడ్డంగా చిక్కారు.
ఫిర్యాదుదారు తండ్రి నుండి వారసత్వంగా పొందిన వ్యవసాయ భూమిని తన పేరిట మార్చి మ్యుటేషన్ పత్రాలను ఇవ్వడంలో సహాయపడతానని చెప్పి లంచాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం.
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు పకడ్బందీగా వ్యూహరచించి, లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విజేత రెడ్డిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగుతున్నట్టు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి :
-
Indiramma Atmiya Bharosa : రైతు కూలీల ఖాతాలలో డబ్బులు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Bank Holidays : జూలైలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు.. లిస్ట్ ఇదే..!
-
Drinking water : ఈ ప్రాంతంలోని 245 గ్రామాలు, 3 మున్సిపాలిటీలలో 36 గంటలు త్రాగునీరు బంద్..!
-
District collector : జిల్లా కలెక్టర్ రైతులకు భారీ శుభవార్త.. అందుబాటులోకి ధాన్యం తడిసినా.. ఆరబెట్టే యంత్రం..!
-
Gold Price : మరోసారి కుప్ప కూలిన గోల్డ్.. భారీగా దిగి వచ్చిన బంగారం..!









