ఆంధ్రప్రదేశ్Breaking Newsరాజకీయం
TDP : టిడిపికి సీనియర్ నేత రాజీనామా.. 43 ఏళ్ల ప్రస్థానానికి తెర..!
TDP : టిడిపికి సీనియర్ నేత రాజీనామా.. 43 ఏళ్ల ప్రస్థానానికి తెర..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేత అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు. ఆయన 43 సంవత్సరాల రాజకీయ ప్రస్థానానికి తెర పడింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పూసపాటి అశోక్ గజపతిరాజు రాజీనామా లేఖను ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు పంపారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
అశోక్ గజపతిరాజు ఇటీవల గోవా రాష్ట్ర గవర్నర్ గా నియమితులై బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీకి తప్పనిసరిగా రాజీనామా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన రాజీనామాను అధికారికంగా సమర్పించారు.
గోవా గవర్నర్ గా రాజకీయాలకతీతంగా పనిచేయాల్సి ఉన్నందున తెలుగుదేశం పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని తెగ తెంపులు చేసుకున్నారు.
MOST READ :
-
TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!
-
District collector : అస్వస్థతకు గురైన గురుకుల విద్యార్థినులు.. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్..!
-
Nails Color: గోళ్ల రంగులతో మీ ఆరోగ్య సమస్య చెప్పేయొచ్చు.. ఎలాగంటారా..!
-
Miryalaguda : సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలి..!









