Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబాబాద్ జిల్లా

Thorruru : గుర్తుతెలియని వాహనం ఢీకొని.. అక్కడిక్కడే మృతి..!

Thorruru : గుర్తుతెలియని వాహనం ఢీకొని.. అక్కడిక్కడే మృతి..!

తొర్రూరు, మన సాక్షి :

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో దుర్మరణం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని వెలికట్టే గ్రామానికి చెందిన మాసాని ఐలయ్య (65) మతిస్థిమితం లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ ఉంటాడు.

మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఐలయ్య వెలికట్టే గ్రామం నుంచి తొర్రూరు హైవేపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని పెద్ద వాహనం అతడిని ఢీకొట్టింది. దీంతో ఐలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి కుమారుడు సైదులు, కుమార్తె ఎల్లమ్మ ఉన్నారు. కుమారుడు సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్సై ఉపేందర్ తెలిపారు.

MOST READ :

  1. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్‌ న్యూస్.. ఆ రూట్లలో బస్ టికెట్ల ధరలపై రాయితీ..!

  2. Nagarjunasagar : నాగార్జునసాగర్ గేట్లు ఓపెన్.. ఇక పర్యాటకుల సందడి.. ( వీడియో)

  3. Sub Collector : కల్లూరు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది ఎవరో తెలుసా..!

  4. GST on UPI : ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రూ.2వేలకు పైగా పేమెంట్లపై జిఎస్టి.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

మరిన్ని వార్తలు