Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : సాగునీటి కోసం.. రైతుల ధర్నా.. రాస్తారోకో..!

Nalgonda : సాగునీటి కోసం.. రైతుల ధర్నా.. రాస్తారోకో..!

నల్గొండ, మన సాక్షి :

నల్గొండ జిల్లాలో రైతులు సాగు నీటిని విడుదల చేయాలని అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. తిప్పర్తి మండల కేంద్రంలో డి 40, డి 39 కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని డిమాండ్ చేశారు.

నాగార్జునసాగర్ నుండి 26 గేట్ల ద్వారా నీళ్లు పోతున్నప్పటికీ, జిల్లా మంత్రులు, శాసనసభ్యులు కనీసం అవగాహన లేకుండా నల్లగొండ జిల్లాను ఎండ పెడుతున్నారని, ఉదయ సముద్రం 1.5 టిఎంసి పూర్తిస్థాయిలో నింపి ఆయకట్టు పరిధిలోని అన్ని చెరువుల నింపి, రైతులకు పంటల కోసం నీరు అందించాలని డిమాండ్ చేశారు.

అధికారులు వారాబంది పేరుతో ఐటిపాముల కాలువకు వారం రోజులు నీళ్లు వదులుతున్నారు. కానీ తిప్పర్తి మండలం లోని D 40, D 39 కాల్వకు వారబంది అమలు చేయడం లేదన్నారు. ఐటిపాముల కాలువ సగం పోతున్నది.. గేట్లు పైకి ఎత్తడం లేదు, అధికారులు, అధికార పార్టీ నాయకులు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప పూర్తిస్థాయిలో చివరి ఆయకట్టు వరకు నీరు పోవడానికి కావలసినటువంటి ప్రణాళికలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు కాలువ వెంట తిరిగి అన్ని చెరువులను నింపే విధంగా ప్రయత్నం చేయాలని అన్నారు.

ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు కళ్ళు తెరిచి రాజకీయాలు పక్కన పెట్టి తిప్పర్తి మండలం లోని చెరువుల నింపే విధంగా అధికారుల పైన స్థానిక మంత్రిపైనా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజానీకాన్ని ఆదుకోవాలని కోరారు. ఆదివారం వరకు మాకు పూర్తిస్థాయిలో కాలువలు వదలక పోతే సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం రైతులతో కలిసి ముట్టడిస్తామని అన్నారు. రైతుల ధర్నా, రాస్తరోకోకు బీఆర్ఎస్, సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్, బిఆర్ఎస్ నాయకులు కందుల లక్ష్మయ్య, సిపిఎం మండల కార్యదర్శి మన్నెం బిక్షం, రైతులు గుండెబోయిన రామచంద్ర, గుండేబోయిన సైదులు, రొట్టెల జానయ్య, దేవి రెడ్డి లింగారెడ్డి, చింతకుంట్ల దయాకర్ రెడ్డి, నూకల ప్రవీణ్, రావుల సందీప్, నూకల రాజీవ్, బైరగోని శ్రీను జాకటి బాలయ్య, కట్ట కిట్టు, గుండు రవి, జానీ పాషా, కస్పరాజు వెంకన్న, రొట్టెల సైదులు, మర్రి వెంకన్న, దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Baba Vanga : బాబా వంగా చెప్పింది నిజమే.. 2025లో ఏం జరగబోతోంది..!

  2. Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)

  3. Job Mela : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. పదవ తరగతి ఆపై అర్హతల వారికి మెగా జాబ్ మేళా..!

  4. TG News : తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత షురూ.. వారి కార్డులు కట్..!

మరిన్ని వార్తలు