Miryalaguda : మిర్యాలగూడలో సాండ్ బజార్.. తక్కువ ధరకే ఇసుక..!
Miryalaguda : మిర్యాలగూడలో సాండ్ బజార్.. తక్కువ ధరకే ఇసుక..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. ప్రభుత్వం అందజేసే 5 లక్షల రూపాయల లోనే ఇందిరమ్మ ఇల్లు పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. అందుకుగాను లబ్ధిదారులకు ఇసుక, సిమెంటు, స్టీలు తక్కువ ధరలకు వచ్చే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సాండ్ బజార్ ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని చింతపల్లి బైపాస్ ఎక్స్ రోడ్డు వద్ద సాండ్ బజార్ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎలాంటి టెన్షన్ లేకుండా తక్కువ ధరకు ఇసుకను అందించనున్నారు.
టన్ను ఇసుక 1250 రూపాయలకు అందించనున్నారు. ఈనెల 7వ తేదీన సాండ్ బజార్ ను రాష్ట్ర మైనింగ్ శాఖ అధికారులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించింది. దాంతోపాటు వికలాంగులకు, ఒంటరి మహిళలకు మరో 1500 ఇళ్ళు కేటాయించింది.
కాగా వారందరికీ తక్కువ ధరకు ఇసుక అందించేందుకు ప్రభుత్వం సాండ్ బజార్ ను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకతో పాటు సిమెంటు, స్టీలు కూడా తక్కువ ధరకు అందించే విధంగా స్థానిక శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ చర్యలు చేపట్టారు.
లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంటు, స్టీలు అందించేందుకు గాను సిమెంట్ పరిశ్రమల యాజమాన్యంతో చర్చలు నిర్వహించారు. చర్చలు సఫలం అయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇసుకతో పాటు సిమెంటు, స్టీలు కూడా తక్కువ ధరకు లభించే అవకాశాలు ఉన్నాయి.
MOST READ :
-
Good News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!
-
Nalgonda : అత్యంత ఆధునిక సౌకర్యాలతో నల్గొండ జిల్లా కేంద్రంలో 13 కోట్లతో ఇందిరా భవన్ నిర్మాణం..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం.. ఏదైనా పిన్ నెంబర్ ఉండదు.. మరి లావాదేవీలు ఎలాగో తెలుసుకుందాం..!
-
Sub Collector : మదనపల్లె సబ్ కలెక్టర్ గా ఎవరో తెలుసా..!









