తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : భూ భారతి ఆర్జీలపై జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశం..!

Suryapet : భూ భారతి ఆర్జీలపై జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశం..!

సూర్యాపేట, మనసాక్షి :

భూ భారతి అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి భూ సమస్యను పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. మంగళవారం సూర్యాపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ భూభారతి అర్జీలపై అధికారుల బృందాలు గ్రామాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలించి భూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని, అర్హులకు నూతన రేషన్ కార్డును కూడ త్వరగా పంపిణీ చేయాలని ఆదేశించారు.

ఈ సందర్బంగా తహసీల్దార్ భూ భారతి రెవిన్యూ సదస్సుల ద్వారా 1758 అర్జీలు వచ్చాయని 369 అర్జీలను ఎంక్వయిరీ చేయనైనదని వాటిలో 34 అర్జీలను పరిష్కరించడం జరిగిందని మిగిలిన వివిధ దశలో ఉన్నాయని అదనపు కలెక్టర్ కి వివరించారు.
ఈ కార్యక్రమం లో తహసీల్దార్ సి. హెచ్. కృష్ణయ్య, డి టి లావణ్య, సీనియర్ అసిస్టెంట్ కపిల్, అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Good News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Miryalaguda : గెస్ట్ మహిళ ఉపాధ్యాయుల కొరకు దరఖాస్తుల స్వీకరణ..!

  3. Nalgonda : అత్యంత ఆధునిక సౌకర్యాలతో నల్గొండ జిల్లా కేంద్రంలో 13 కోట్లతో ఇందిరా భవన్ నిర్మాణం..! 

  4. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తా..!

  5. Miryalaguda : మిర్యాలగూడలో సాండ్ బజార్.. తక్కువ ధరకే ఇసుక..!

మరిన్ని వార్తలు