Hyderabad : ఏల్లమ్మ బండలో వ్యక్తి దారుణ హత్య..!
Hyderabad : ఏల్లమ్మ బండలో వ్యక్తి దారుణ హత్య..!
కుత్బుల్లాపూర్, (మన సాక్షి)
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏల్లమ్మబండలో భయానక హత్య జరిగింది.ఏ ల్లమ్మ బండ గుడ్ విల్ హోటల్లో చాయ్ తాగుతున్న వ్యక్తిని ఆటోలో వచ్చిన దుండగులు మంగళవారం సాయంత్రం విచక్షణ రహితంగా నరికి హత్య చేశారు.
హత్యకు గురైన వ్యక్తి ముషీరాబాద్ కు చెందిన మహబూబ్ (35)గా గుర్తించారు. మహబూబ్ కూడా కరుడు గట్టిన నేరస్తుడని, అతనిపై వివిధ పోలీస్ స్టేషన్లో 13 కేసులకు నమోదు అయ్యాయని, పాత కక్షల కారణంగా హత్య చేసినట్టు అనుమానిస్తున్న పోలీసులు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
హత్య సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
హత్యకేసు కు సంబంధించి వివరాలను బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చి హోటల్లో ఉన్న ముషీరాబాద్ కు చెందిన రౌడీషీటర్ ఎం.డి మహబూబ్ (35)ను ముగ్గురు వ్యక్తులు కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం అందిందని అన్నారు.
వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించాలని తెలిపారు. ఎం.డి మహబూబ్ గతo లో రౌడీ షీటర్ అని అతనిపైన వివిధ పోలీస్ స్టేషన్ లో 13 కేసులు ఉన్నాయని,అందులో ఎక్కువగా దొంగతనం కేసులతోపాటు పఠాన్ చెరువు లో హత్య కేసులో సైతం నిందితుడిగా ఉన్నట్లు డీసీపీ తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నట్లు తెలిపారు.
MOST READ :









