తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : కొడుకు తిండి పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ కు వృద్ధురాలు ఫిర్యాదు.. స్పందించిన జిల్లా కలెక్టర్ ఏం చేసిందంటే..!

District collector : కొడుకు తిండి పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ కు వృద్ధురాలు ఫిర్యాదు.. స్పందించిన జిల్లా కలెక్టర్ ఏం చేసిందంటే..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

కొడుకు, కోడలు ఉన్నా నిరాదరణకు గురై నడవలేని స్థితిలో ఓ వృద్ధురాలు తనకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరడానికి కలెక్టరేట్ కు వచ్చి పడుతున్న ఇబ్బందిని కళ్ళారా చూసిన జిల్లా పాలనాధికారిని తక్షణం స్పందించారు. వృద్ధురాలి దీనస్థితిని విని పాలనాధికారి చలించారు.

వృద్ధురాలి బాగోగులు చూడని ఆమె కొడుకుపై చర్య కు ఉపక్రమించారు. నారాయణపేట జిల్లా కలెక్టరేట్ లో ప్రతీ వారం మాదిరిగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజావాణి గదిలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అయితే నారాయణ పేట పట్టణానికి చెందిన రుక్మిణి (54) అనే వృద్ధురాలు నడవలేని స్థితిలో తన ఇద్దరు కూతుర్ల సాయంతో కలెక్టరేట్ మెట్లు ఎక్కడానికి ఎంతో ప్రయాస పడుతోంది.

ఉదయం మద్దూరు సీ హెచ్ సీ ని ఆకస్మిక తనిఖీ చేసి అప్పుడే కలెక్టరేట్ కు వచ్చిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తన వాహనంలో నుంచే వృద్ధురాలు రుక్మిణి మెట్లు ఎక్కడానికి పడుతున్న ఇబ్బందిని చూసి వెంటనే తన వాహనం దిగి నేరుగా స్వయంగా తానే రుక్మిణి వద్దకు వెళ్ళి ఆమె సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు.

తన కొడుకు, కోడలు తనను చూసుకోవడం లేదని, చనిపోయిన తన భర్త ఉద్యోగం పొందిన కొడుకు తనకు తిండి పెట్టడం లేదని, కోడలు సైతం సూటి పోటీ మాట్లాడుతోందని, నడవలేని ( షుగర్, నడుం సంబంధిత వ్యాధి వల్ల) తనను ఇక్కడే అత్తగారింట్లో ఉంటున్న తన పెద్ద కూతురు వద్ద తన కొడుకు వదిలి వెళ్ళాడని, ఎలాగైనా తనకు న్యాయం చేసి ఆదుకోవాలని వృద్ధురాలు రుక్మిణి కలెక్టర్ తో మొర పెట్టుకుంది.

వెంటనే స్పందించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ వృద్ధురాలి కోసం వీల్ చైర్ తెప్పించి తక్షణ రక్షణ కోసం పట్టణంలోని సఖీ కేంద్రంలో రుక్మిణిని చేర్పించి, రుక్మిణి కొడుకు పై తగిన చర్య తీసుకునేందుకు ఆర్డీఓ రామచందర్ ను విచారణ కు ఆదేశించింది.

MOST READ : 

  1. Rythu Bima : 18 ఏళ్లు నిండిన వారికి ఐదు లక్షల బీమా.. రెండు రోజులే గడువు.. కావలసిన పత్రాలు ఇవీ..!

  2. Govt Scheme : ఆడపిల్ల పుడితే తల్లికి రూ. 6000.. స్పెషల్ స్కీం.. దరఖాస్తు ఇలా..!

  3. Agricultural Tools : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు.. దరఖాస్తులు స్వీకరణ..!

  4. TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!

  5. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. వారందరికి టికెట్లపై రాయితీ..!

మరిన్ని వార్తలు