Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

District collector : ఎరువుల విక్రయాల్లో జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. సహకార సంఘం ఆకస్మిక తనిఖీ..!

District collector : ఎరువుల విక్రయాల్లో జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. సహకార సంఘం ఆకస్మిక తనిఖీ..!

జగిత్యాల, (మన సాక్షి)

ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా ఆధార్ కార్డుతో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.
మంగళవారం  కథలాపూర్ మండలం భూషణ్ రావు పేట్ , సిరికొండ గ్రామాలలో మేడిపల్లి మండల కేంద్రంలో  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ యూరియా, ఇతర ఎరువుల స్టాక్ వివరాలను, ఎరువుల సరఫరాపై  ప్రతీ రైతుకి ఎన్ని బస్తాలు సరఫరా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా రైతులకు సంబంధించిన భూమి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం రైతులు వేసిన పంటకు అవసరమైన ఎరువులు మాత్రమే సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.

రికార్డులు పరిశీలించి స్టాక్ ఎంత వచ్చింది, ఎంత సరఫరా చేసాం అన్నది తప్పనిసరి రికార్డ్ చేసుకోగలరని అధికారులను కలెక్టర్ ఆదేశించించారు.
రైతులకు ఎవరికైనా ఎక్కువ మొత్తంలో ఎరువులు పంపిణీ  చేసినట్లయితే అట్టి సొసైటీ సిబ్బందిపై, వ్యవసాయ శాఖ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జి వాకర్ రెడ్డి, తహసిల్దార్ లు ఎంపీడీవోలు  సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. కొత్తగా 10 మార్కెట్ యార్డులు.. ఎక్కడెక్కడంటే..!

  2. District collector : కొడుకు తిండి పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ కు వృద్ధురాలు ఫిర్యాదు.. స్పందించిన జిల్లా కలెక్టర్ ఏం చేసిందంటే..!

  3. Rythu Bima : 18 ఏళ్లు నిండిన వారికి ఐదు లక్షల బీమా.. రెండు రోజులే గడువు.. కావలసిన పత్రాలు ఇవీ..!

  4. Blood Group : మీకు ఆ బ్లడ్ గ్రూప్ ఉంటే స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.. అధ్యయనంలో నిర్ధారణ..!

  5. Rythu Bheema : రైతు బీమాకు దరఖాస్తులు స్వీకరణ..!

మరిన్ని వార్తలు