Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. ఆ నిందితుడికి ఉరిశిక్ష..!

Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. ఆ నిందితుడికి ఉరిశిక్ష..!

నల్లగొండ, మన సాక్షి :

నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్ బాలిక పై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. వివరాల ప్రకారం..
నల్లగొండ జిల్లా కేంద్రం లో 2013 ఏప్రిల్ 28న వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 11 ఏళ్ల మైనర్ బాలికపై మన్యం చెల్క లోని హైదర్ ఖాన్ గూడ లో అత్యాచారం చేసి, చున్నీతో ఉరి వేసి చంపి మురికి కాలవలో పడేసిన కేసులో నిందితుడు మహమ్మద్ ముక్రం పైన మృతురాలి తండ్రి పిర్యాదు మేరకు, నల్లగొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సోచట్టం 2012లోని సెక్షన్ 6 కింద కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేసి అనంతరం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా, గురువారం అడిషనల్ జడ్జి కమ్ ఎస్సీ ఎస్టీ కోర్టు కోర్టు & అత్యాచారం పోక్షోకేసుల కోర్ట్ నిందితునికి దోషిగా నిర్ధారించి, తీర్పులో భాగంగా మర్డర్ కేస్ లో మరణశిక్ష (డబల్ డెత్ పెనాల్టీ ) రూ.1,10,000 జరిమానా విధించగా, బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారనీ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు అని అన్నారు.అలాగే ఎలాంటి కేసులో అయిన సాక్షులను భయపెట్టడం గాని, తప్పుదోవ పట్టించడం గాని మరియు రాజీ పడాలని ఎవరైనా ఒత్తిడి చేస్తే పోలీస్ వారి దృష్టికి తీసుకురావాలని, అట్టి వారి పై చర్యలు తప్పవని తెలిపారు. ఇలాంటి పోక్సో కేసులలో ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుందని తెలిపారు.

ఈ కేసులో సరి అయిన సాక్ష్యదారలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించి నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విజయ కుమార్ డి స్ పి అలాగే ప్రాసెక్యూషన్ కు సహకరించినడీఎస్పీ శివరాం రెడ్డి, నల్గొండ, సిఐ రాజశేఖర్ రెడ్డి,1 టౌన్ పీఎస్, ఎస్ ఐ గుత్తా వెంకట్ రెడ్డి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కందుగుల శ్రీవాణి, దామోదరం శ్రీవాణి, వేముల రంజిత్ కుమార్ సి డి ఓ వెంకటేశ్వర్లు, రాంబాబు లైజన్ అధికారులు, నరేందర్.మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ పోలీసు కార్యాలయంలో అభినందించి సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా నిందితునికి మరణ శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీసు అధికారులకు పబ్లిక్ ప్రాసెక్యూటర్స్లకు, మృతురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ పై పూర్తి నమ్మకం,విశ్వాసం ఈ తీర్పుతో కలిగిందని హర్షం వ్యక్తపరిచారు.

MOST READ :

  1. Nagarjunasagar : నిండుకుండలా నాగార్జునసాగర్.. 24 గేట్లు ఎత్తి నీటి విడుదల..!

  2. TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. విద్యా సంస్థలకు సెలవు, ఐటి ఉద్యోగులకు ఇంటి నుంచే పని, వారికి మాత్రం సెలవులు రద్దు..!

  3. Rythu Bima : రైతు బీమా పథకంలో కీలక అప్ డేట్..!

  4. TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. కొత్తగా 10 మార్కెట్ యార్డులు.. ఎక్కడెక్కడంటే..!

  5. District collector : కొడుకు తిండి పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ కు వృద్ధురాలు ఫిర్యాదు.. స్పందించిన జిల్లా కలెక్టర్ ఏం చేసిందంటే..!

మరిన్ని వార్తలు