Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : సంచలనం కలిగించిన బంగారం చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్..!

Suryapet : సంచలనం కలిగించిన బంగారం చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్..!

సూర్యాపేట, మనసాక్షి

సూర్యాపేట జిల్లాలో సంచలనం రేపిన బంగారం దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని జిల్లా ఎస్పీ కే.నరసింహ తెలిపారు. చోరీకి సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల జిల్లా కేంద్రంలోని సాయి సంతోషి బంగారం దుకాణాంలో రెండున్నర కిలోల బంగారం చోరీ చేసిన ముఠాలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని అన్నారు.

కొద్దిరోజుల క్రితం ఖమ్మం పట్టణానికి చెందిన యశోద ఏ7 అరెస్ట్ చేసి నిందితురాలి నుండి 14 తులాల బంగారం రికవరీ చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. నిందితురాలిని విచారణ చేయగా ఏడుగురు నిందితులు ఈ దొంగతనంలో పాల్గొన్నట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. చోరీ కేసులో భాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేశామని అన్నారు.

ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాల గాలింపు చర్యల్లో భాగంగా చోరీ ముఠాలోని ఓ నిందితున్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దక్షిణ దినాజ్పూర్ జిల్లాలో ఏ4 మాలిక్ మోల్ల అనే నిందితున్ని అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు.

ఖమ్మం పట్టణంలో మరొకరు నిందితుడు ఏ6 అమర్ భట్ అనే నిందితున్ని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. వీరి వద్ద నుంచి 60 లక్షల విలువగల అరకిలో బంగారాన్ని, 92,500 రూపాయల నగదును స్వాధీనం చేశామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య , సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సీసీ హరికృష్ణ, ఎస్సై శివతేజ, తదితరులు పాల్గొన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డ్ అందించారు.

MOST READ : 

  1. SBI : ఎస్బిఐ అదిరిపోయే ఆఫర్.. వారికి పూచికత్తు లేకుండా రూ.4 లక్షల రుణం..!

  2. TG News : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఆగస్టు 22 లోపే..!

  3. District collector : ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో జాతీయ గీతం.. ఆలపించిన జిల్లా కలెక్టర్..!

  4. UPI Payments : డిజిటల్ చెల్లింపులలో ఇది చాలా ఈజీ తెలుసా..!

  5. Phone Pe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఆ సేవలు బంద్..!

మరిన్ని వార్తలు