Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : పోలీస్ జాగిలంకు ఘనంగా అధికార లాంచనాలతో అంత్యక్రియలు..!

Nalgonda : పోలీస్ జాగిలంకు ఘనంగా అధికార లాంచనాలతో అంత్యక్రియలు..!

నల్లగొండ, మన సాక్షి,

నేర పరిశోధనలో సాటి లేని జాగిలం, వాసన పసిగట్టిందంటే వదిలి పెట్టని నైజం అనేక కీలక కేసులలో నేరస్థులను డిటెక్ట్ చేసి పోలీస్ శాఖకు వెన్ను దన్నుగా నిలిచి దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు విధి నిర్వహణలో విశేష సేవలు అందించి అనారోగ్య కారణంగా మరణించడం చాలా బాధాకరం అని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.

జిల్లా పోలీస్ శాఖలో డాగ్ స్క్వాడ్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ జాగిలం పింకీ అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు తుది శ్వాస విడిచింది. దీంతో ఎస్పీ శరత్ చంద్ర పవర్ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రమేష్ చనిపోయిన జాగిలానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు.

2014 సంవత్సరంలో ఐఐటీ మొయినాబాద్ లో 9 నెలల పాటు డాగ్ హ్యాండ్లర్ నాగరాజు తో పాటు శిక్షణ పొంది శిక్షణా కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది.

పింకీ సాధించిన ఘనతలు:

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విధినిర్వహణలో భాగంగా నల్లగొండ 1 టౌన్ పరిదిలో బొట్టుగూడలో ఒక వ్యక్తిని ముక్కలు ముక్కలుగా చేసి పలు చౌరస్తాలలో తల మొండెం వేరు చేసిన సంచలన హత్య కేసులో కీలకమైన పాత్ర పోషించింది.నల్లగొండ జిల్లా కేంద్రం లో జూలకంటి ఇంద్ర రెడ్డి ఫంక్షన్ హల్ వద్ద జరిగిన 1కోటి 40 లక్షల రూపాయల చోరీ కేసులో గంటల వ్యవధిలో నిందితుల జాడలను తెలిపింది.

గుండాల మండలం లోని వంగాల గ్రామం లో ఒక వ్యక్తిని చంపి బావిలో పడవేసిన వారం రోజుల తరువాత విషయం తెలుసుకున్న తరువాత ఈ డాగ్ తో అన్వేషణ చేస్తే నిందితుల ఇండ్ల లోకి వెళ్లి పసిగట్టింది. ఇలా పింకీ విధి నిర్వహణలో చేసిన సేవలు మరువలేనివి.

ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డిఎస్పి శ్రీనివాసులు, ఆర్ఐ సంతోష్, ఆర్.యస్.ఐ రాజీవ్,డాగ్ హ్యాండ్లర్ నాగరాజు డాగ్ స్క్వాడ్ సిబ్బంది కరుణాకర్, సంపత్,సతీష్, గోపాల్, మహేంద్ర, నరేష్ఇ తర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nagarjunasagar : నాగర్జున సాగర్ కు భారీగా పర్యాటకులు.. 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల..!

  2. SBI : ఎస్బిఐ అదిరిపోయే ఆఫర్.. వారికి పూచికత్తు లేకుండా రూ.4 లక్షల రుణం..!

  3. District collector : ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో జాతీయ గీతం.. ఆలపించిన జిల్లా కలెక్టర్..!

  4. Suryapet : సంచలనం కలిగించిన బంగారం చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్..!

మరిన్ని వార్తలు