Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Nalgonda : తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేందుకు దైవకృప అవసరం..!

Nalgonda : తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేందుకు దైవకృప అవసరం..!

నల్లగొండ, మన సాక్షి :

తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేందుకు దేవుని కృప అవసరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు వినాయక చవితి సందర్భంగా ఆమె జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి నల్గొండ జిల్లా కేంద్రంలోని రామాలయంలో ఏర్పాటుచేసిన మొదటి గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లా ప్రజలు సుభిక్షంగా, కలిసిమెలిసి సంతోషంగా ఉండేలా వినాయకుడు అందరిని ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ప్రజలు తలపెట్టిన కార్యాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా కొనసాగేందుకు ప్రజలంతా సుఖఃసంతోషాలతో ఉండేందుకు దేవుని కృప అవసరమని, వినాయకుడు తన కృపను, కరుణా కటాక్షాలను ప్రజలకు అందించి దీవించాలని వేడుకొన్నారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి ,గణేష్ ఉత్సవ సమితి సెక్రటరీ యాదగిరి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు : 

వినాయక చవితి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాధునికి జిల్లా ఎస్పీ శరత్ చాంద్రాపవర్ పాల్గొని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అధికారులకు,సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ, జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణం భక్తి శ్రద్ధలతో కులమతాలకు అతీతంగా సోదరభావం నిర్వహించుకోవాలనీ తెలిపారు.

మండపాల వద్ద నిర్వాహకులు, యువత పోలీస్ వారి సూచనల పాటిస్తూ సహకరించాలని తెలిపారు.
ఈ పూజ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, 2 టౌన్ సీఐ రాఘవరావు, ట్రాఫిక్ సీఐ మహా లక్ష్మయ్య, ఆర్.ఐలు సంతోష్, సూరప్ప నాయుడు, శ్రీను, నరసింహ, హరిబాబు, యస్.ఐ సైదా బాబు, ఆర్.యస్.ఐలు కళ్యాణ్ రాజ్, రాజీవ్, అఖిల్, సాయి రామ్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Heavy Rain : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రూట్ లో రైళ్ల రాకపోకలు బంద్.. ( వరదల వీడియో)

  2. Miryalaguda : జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి మీరు అర్హులైతే.. వెంటనే ధరఖాస్తు చేసుకోవాలి..!

  3. Sony: సోనీ ఇండియా నుండి హై-స్పీడ్ CFexpress 4 మెమొరీ కార్డులు.. రికార్డింగ్, ఫైల్ ట్రాన్స్‌ఫర్ ఇక సులభం..! 

  4. Hyderabad : పరుగుల సత్యం.. నేటి యువతకు ఆదర్శం..!

మరిన్ని వార్తలు