Narayanpet : గణపతి పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ దంపతులు..!
Narayanpet : గణపతి పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ దంపతులు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి విగ్రహం వద్ద జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ దంపతులు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్యపోలీసు అధికారులు, సిబందితో కలిసి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదాలు తీసుకొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ మట్టి వినాయకులను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని అన్నారు.
తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని, కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని అన్నారు. నవరాత్రి ఉత్సవాలకు ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా నవరాత్రులు, నిమజ్జన శోభయాత్ర శాంతియుతంగా నిర్వహించుకోవాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఈ పూజా కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్ ఐ నరసింహ, ఎస్సైలు వెంకటేశ్వర్లు,నరేష్, పురుషోత్తం, ఆర్ఎస్ఐ శివశంకర్, శిరీష, మద్దయ్య, ఏ ఆర్ ఎస్ ఐలు, ఆర్ముడు రిజర్వు పోలీస్ సిబ్బంది, తది తరులు పాల్గొన్నారు.
వాడవాడలా కొలువు దీరిన గణనాథులు :
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రం లో బుధవారం వివిధ కాలనీలో వినాయకులు కొలువుదిరాయి. వినాయక నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా వినాయక ఉత్సవా కమిటీ సభ్యులు తమ మండపాల్లో వినాయకులను ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు.
MOST READ :
-
Hyderabad : దేవుడిచ్చిన బిడ్డ.. ఖైరతాబాద్ మహా గణపతి వద్ద క్యూలైన్లో మహిళ ప్రసవం..!
-
Heavy Rain : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రూట్ లో రైళ్ల రాకపోకలు బంద్.. ( వరదల వీడియో)
-
TDP : విగ్నేశ్వరుని దర్శించుకున్న రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు..!
-
National Award : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణ నుంచి ఎంపికైన మారం పవిత్ర.. ఎవరో తెలుసా..!
-
Hyderabad : పరుగుల సత్యం.. నేటి యువతకు ఆదర్శం..!









