Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణ

BC Reservations : 42 శాతం బీసీ రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోదం.. ఇక స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్..!

BC Reservations : 42 శాతం బీసీ రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోదం.. ఇక స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కు ప్రభుత్వం పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.

గెజిట్ నోటిఫికేషన్ కూడా రాష్ట్ర గవర్నర్ విడుదల చేయడంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించాలని నిబంధన ఉంది. దాంతో ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని భావించింది.

ఇది ఇలా ఉండగా రాష్ట్ర గవర్నర్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లును ఆమోదించడంతో ఇక ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది. ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను చేస్తోంది.

MOST READ :

  1. Nalgonda : రూ.52 లక్షల విలువైన 207 కేజీల గంజాయి దగ్దం..!

  2. Cyber crime : ఆన్‌లైన్ మోసం.. రూ.2.80 లక్షలు పోగొట్టుకున్న గృహిణి..!

  3. Additional Collector : సూర్యాపేట జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ గా సీతారామారావు.. ఎవరో తెలుసా..!

  4. Devarakonda : ఈ దొంగ మామూలోడు కాదు.. మూడు రాష్ట్రాల్లో 100కు పైగా దొంగతనాలు..!

మరిన్ని వార్తలు