Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

Karimnagar : నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్.. అభినందించిన సీపీ..!

Karimnagar : నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్.. అభినందించిన సీపీ..!

కరీంనగర్, మనసాక్షి :

కరీంనగర్ లో ఓ మహిళ ఆటోలో మరచిపోయిన నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ ను తిరిగి ఇచ్చి నిజాయితీ చాటుకున్న తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కనకం రాజేందర్ (40) ను కరీంనగర్ పోలీస్ కమీషనర్ కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం అభినందించి సన్మానించారు.

వేములవాడ నుండి కరీంనగర్ కు వచ్చిన ఒక మహిళ గీతాభవన్ వద్ద ఆటో దిగి ఆసుపత్రికి బయలుదేరిన క్రమంలో తన బ్యాగ్ ను ఆటోలో మరిచిపోయింది. బ్యాగ్ ను గమనించిన ఆటో డ్రైవర్ రాజేందర్ వెంటనే ఆమెను దింపిన స్థలానికి తిరిగి వెళ్లి బ్యాగ్ ను అప్పగించారు. బ్యాగ్ లో నాలుగు తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు ఉన్నట్లు సదరు మహిళ తెలిపారు.

తన కుటుంబంలో ఒకరు అనారోగ్యంతో ఉన్నందున, ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడానికి తీసుకెళ్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ రాజేందర్ నిజాయితీని గుర్తించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం గురువారం కమీషనర్ కార్యాలయానికి పిలిపించి శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మద్దెల రాజేందర్, పడాల రాజమౌళి తో పాటు పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Heavy Rain : తెలంగాణలో మరో మూడు గంటల్లో భారీ వర్షం.. ఆ జిల్లాల్లో అలెర్ట్..!

  2. Mushroom Coffee : మష్రూమ్ కాఫీ.. ఇది కేవలం ట్రెండ్ కాదు.. ఆరోగ్య రహస్యం..తెలుసుకోండి ఇలా..!

  3. Sub Collector : యూరియా పంపిణీ ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్..!

  4. Additional Collector : సూర్యాపేట జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ గా సీతారామారావు.. ఎవరో తెలుసా..!

మరిన్ని వార్తలు