Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాలి..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాలి..!

నల్లగొండ, మన సాక్షి :

ఎలాంటి తప్పులు దొర్లకుండా జడ్పిటిసి, ఎంపీటిసి, గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రెసిడింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఎన్నికల నిర్వహణ విషయమై ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, ఎన్నికల నియమ, నిబంధనల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పిఓ హాండ్ బుక్ ను క్షుణ్ణంగా చదవాలని చెప్పారు. పోలింగ్ కేంద్రంలోకి ఎలాంటి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదని, అలాగే ఎన్నికల కమిషన్ అనుమతించిన వారిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలని చెప్పారు .

పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలన్ని ఉండాలని, ప్రత్యేకించి ఓటింగ్ కంపార్ట్మెంట్ పూర్తిగా లైటింగ్ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ సామాగ్రి పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రత్యేకించి చెక్ లిస్టులను ఏర్పాటు చేసుకొని చెక్ లిస్టు ప్రకారం మెటీరియల్ ను సరిపోల్చుకోవాలని చెప్పారు.

పోలింగ్ కు సంబంధించిన సామాగ్రి పోలింగ్ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా పరిశీలించాలని అన్నారు.ఎన్నికల విధులకు కేటాయించిన ఉద్యోగులందరు తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని, లేనట్లయితే ఎన్నికల నియమ, నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణ అధికారి, గృహ నిర్మాణ పిడి రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nizamabad : మక్క కొనుగోలు కేంద్రం లేక దళారుల దోపిడీ..!

  2. Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!

  3. Croma : పండగ సీజన్ భారీ ఆఫర్స్.. ఏఏ వస్తువులకు.. ఎప్పటి వరకు అంటే..!

  4. Fastrack : అదిరిపోయే లుక్‌తో ఫాస్ట్రాక్ కొత్త వాచెస్.. ఇకపై యూఎఫ్‌వోలు ఆకాశంలో కాదు, మీ చేతిలోనే..!

మరిన్ని వార్తలు