తెలంగాణBreaking Newstravelహైదరాబాద్

TGSRTC : కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు..!

TGSRTC : కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు..!

మేడ్చల్ మల్కాజిగిరి, మనసాక్షి:

కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు. కార్తీక మాసం సందర్భంగా టి జి ఎస్ ఆర్ టి సి కుషాయిగూడ డిపో నుంచి పెళ్లిళ్లకు, శుభకార్యములకు, పుణ్యక్షేత్రాల సందర్శనకు అతి తక్కువ ధరలో బస్సులు అద్దెకు ఇవ్వబడునని డిపో మేనేజర్ వి.వేణుగోపాల్ ప్రకటనలో పేర్కొన్నారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

పంచారామాలు, శ్రీశైలము, వేములవాడ, అరుణాచలం, కొమరవెల్లి మల్లన్న వాటి పుణ్యక్షేత్రాలకు, భక్తులు కోరుకున్న యాత్రలకు బస్సులు ఇవ్వబడునని, అలాగే కార్తీక మాసం సందర్భంగా కీసర గుట్టకు ఈసీఐఎల్ బస్టాండ్ నుండి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

MOST READ : 

  1. District SP : జిల్లా ఎస్పీ హెచ్చరిక.. దౌర్జన్యాలు, బెదిరింపులకు గురి చేస్తే కఠిన చర్యలు..!

  2. District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. తీగల వంతెన, మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలి..!

  3. Bus Accident : కర్నూలు బస్సు దగ్ధం ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పిందంటే.. (వీడియో)

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేద ప్రజలకు మరో భారీ శుభవార్త..!

మరిన్ని వార్తలు