Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

Volleyball : అమన్ యూత్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్..!

Volleyball : అమన్ యూత్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్..!

రుద్రూర్, మన సాక్షి:

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం క్రీడలు మంచి ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, దేహదారుడ్యానికి క్రీడలు ఎంతో ఉపయోగ పడతాయని రుద్రూర్ ఎస్సె సాయన్న అన్నారు. ఆదివారం నాడు అమన్ యూత్ ఆధ్వర్యంలో రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీ మైదానంలో జరిగిన ఒకరోజు వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల ఓర్పు, పట్టుదల, లక్ష్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని ఆయన అన్నారు. యువత చదువుతోపాటు క్రీడలపై శ్రద్ద వహించాలని అన్నారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్ లో 11 జట్లు పాల్గొన్నట్టు అమన్ యూత్ అధ్యక్షులు మొహమ్మద్ ఫుర్జన్ ఖాద్రి తెలియజేశారు. మొదటి బహుమతి జవహర్ నగర్ కాలనీ గౌస్ టీం కి మెమొంటో 4000 రూపాయల నగదు బహుమతి, ద్వితీయ బహుమతి

సులేమాన్ నగర్ కు చెందిన షాదుల్ టీం మెమొంటో తోపాటు 2000 రూపాయలు నగదు బహుమతులు అందించినట్లు మొహమ్మద్ ఫుర్జన్ ఖాద్రి, ఉపాధ్యక్షులు షేక్ అవేజ్ తెలియజేశారు. మొదటి బహుమతి సాధించిన టీంకు 1000 రూపాయలు ద్వితీయ బహుమతి సాధించిన టీంకు 500 రూపాయలను విండో మాజీ చైర్మన్ పత్తి రాము స్వయంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ నిస్సార్, ఖిద్మాత్ సొసైటీ కార్యదర్శి షేక్ సుభాని, ఇమ్రాన్, జఫర్, జమీల్, అమన్ యూత్ సభ్యులు మొహమ్మద్ ఫుర్టన్ ఖాద్రి, ఉపాధ్యక్షులు *అవేజ్,షేక్ సిరాజ్, ముదస్సిర్, అసిఫ్, సిరాజ్, వసీం క్రీడాకారులు యువకులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Hyderabad : ఇందిరా పార్క్ వద్ద అగ్ని ప్రమాదం.. దగ్ధమైన ఎలక్ట్రిక్ కారు..!

  2. Adhaar : రైతులకు ఆ సమయంలో ఆధార్ కార్డు వెంట తప్పనిసరి..!

  3. BIG BREAKING : జమ్ము కాశ్మీర్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 30 మంది గాయాలు..!

  4. Bus Fire : మరో బస్సు దగ్ధం.. 42 మంది సజీవ దహనం..!

మరిన్ని వార్తలు