Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. అర్హులందరికీ ఇందిరమ్మ చీరలు..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. అర్హులందరికీ ఇందిరమ్మ చీరలు..!

కరీంనగర్, మనసాక్షి

ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హులందరికీ చీరలు అందేలా మహిళా సంఘాల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా, మండల మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న చీరలు ప్రతి ఒక్కరికి చేరేలా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు పర్యవేక్షించాలని అన్నారు.

ఓపెన్ స్కూల్, వయోజనుల విద్య నమోదులో జిల్లా లక్ష్యాన్ని పూర్తి చేసిందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఓపెన్ 10వ తరగతి, ఇంటర్లో నమోదు చేసుకున్నారని తెలిపారు.

వీరంతా తరగతులకు కూడా హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతి మూడవ శనివారం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి తల్లిదండ్రులు కచ్చితంగా హాజరయ్యేలా సమాఖ్య సభ్యులు చూడాలని అన్నారు.

ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మంజూరైన వివిధ యూనిట్లతో వ్యాపారాలు ప్రారంభించిన మహిళా సంఘాలు కృషి పట్టుదలతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లాభాలు గడించాలని తెలిపారు.

బ్యాంకు లింకేజీ రుణాల మంజూరు, రికవరీలో జిల్లా నెంబర్ వన్ స్థానంలో నిలవడం గొప్ప విషయమని, అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న సంఘాలు మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు.

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా అధికారులు, జిల్లా, మండల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

క్లిక్ చేసి ఇవి కూడా చదవండి : 

  1. Nalgonda : చదువుతూనే అన్ని సాధ్యమవుతాయి.. గ్రంథాలయ వారోత్సవాలలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి..!

  2. Bus Fire : మరో బస్సు దగ్ధం.. 42 మంది సజీవ దహనం..!

  3. Hyderabad : ఇందిరా పార్క్ వద్ద అగ్ని ప్రమాదం.. దగ్ధమైన ఎలక్ట్రిక్ కారు..!

మరిన్ని వార్తలు