Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో భారీ చోరీ కేసు.. నాలుగు లక్షల నగదు పోలీసులు స్వాధీనం..!

Nalgonda : నల్గొండ జిల్లాలో భారీ చోరీ కేసు.. నాలుగు లక్షల నగదు పోలీసులు స్వాధీనం..!

దేవరకొండ, మనసాక్షి :

నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో సంచలనం సృష్టించిన భారీ దొంగతనం కేసును స్థానిక పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. పట్టపగలు తాళం పగులగొట్టి ఏకంగా రూ. 8 లక్షల నగదును దోచుకెళ్లిన అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేయడమే కాక అతని వద్ద నుంచి రూ. 4 లక్షల 18000 నగదుతో పాటు కంప్యూటర్, బంగారం స్వాధీనం చేసుకున్నారు. వ్యసనాల కోసం వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు. ​నవంబర్ 11వ తేదీన దేవరకొండ పట్టణంలో అయ్యప్ప నగర్‌లోని శరావత్ జబ్బార్ ఇంటిలో పట్టపగలు తాళం పగులగొట్టి దొంగతనం జరిగింది.

సుమారు రూ. 8 లక్షల నగదు అపహరణకు గురవగా బాధితుడి ఫిర్యాదు మేరకు దేవరకొండ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 337/2025 యూ/ఎస్ 331 (3), 305 (ఏ) బి.ఎన్.ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

​ఈ కేసు దర్యాప్తును దేవరకొండ ఏఎస్పీ పి. మౌనిక ఆదేశాలతో సీ ఐ పి. వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్సైలు నారాయణ రెడ్డి, రాజు, ఇతర సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం చేపట్టింది. సీసీ టీవీ సాంకేతిక ఆధారాల సహాయంతో విచారణ జరిపిన పోలీసులు ఈ భారీ చోరీకి పాల్పడిన నిందితుడు చింతపల్లి మండలం వింజమూర్ గ్రామానికి చెందిన పగిళ్ల శివ (23 ) గా గుర్తించారు.

కేవలం పదవ తరగతి వరకే చదువుకున్న శివ 14 ఏళ్ల వయసు నుంచే తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తుడని తెలంగాణవ్యాప్తంగా ఇతనిపై సుమారు 11కు పైగా దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు.
​చెడు సహవాసం, జూదం (బెట్టింగులు) వంటి వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతోనే చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించాడు.

మొదట పగటిపూట రెక్కీ చేసి అనువైన ఇంట్లో తాళం పగులగొట్టి దొంగతనాలకు పాల్పడేవాడని పోలీసులు గుర్తించారు. ​దేవరకొండలో చోరీ చేసిన డబ్బులో కొంత భాగాన్ని కంప్యూటర్ కొనుగోలుకు ఉపయోగించి మిగిలిన సొమ్మును తాను ప్రసూతం నివాసం ఉంటున్న హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని తన ఇంటిపై దాచిపెట్టాడు. అయితే నిందితుడు శివ శనివారం మళ్లీ ఏదైనా తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేద్దామని దేవరకొండ పట్టణానికి రాగా పోలీసులు అతడిని అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. ​

అనంతరం నిందితుడిని వెంటబెట్టుకుని హైదరాబాద్ వెళ్లిన పోలీసులు పంచుల సమక్షంలో అతను దాచిన రూ. నాలుగు లక్షల 18000 నగదుతో పాటు ఒక మోనిటర్, సీపీయూ, 5 గ్రాముల బంగారు చెవిపోగులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శివపై దేవరకొండ పీఎస్ పరిధిలోనే గతంలోనూ పలు దొంగతనం కేసులు ( సి ఆర్ నెంబర్ : 312/2024, 313/2024, 338/2025) నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన ఎస్సైలు వి. నారాయణ రెడ్డి, రాజు, పోలీసుస్ సిబ్బంది ఎస్ కే. చాంద్ పాషా, బి.అంజయ్య, కే. సతీష్, వి.సింహాద్రి, కే.హరిబాబు,జి. యాదయ్య,ఎస్. చంద్రమౌళి లను ఉన్నతాధికారులు అభినందించారు. సమావేశంలో ఎస్సై సాలకమ్మ, ఎస్సై మౌనిక, కానిస్టేబుల్ బాలు నాయక్ ఉన్నారు.

MOST READ : 

  1. RRR : త్రిబుల్ ఆర్ కు భూములు ఇచ్చేది లేదు.. పంచాయతీ కార్యాలయంలో అధికారులను బంధించిన రైతులు..!

  2. District collector : జిల్లా కలెక్టర్ సాహసం.. ఓ మహిళ ధరఖాస్తుకు స్పందించి చెంచువాని తండాలో పర్యటన..!

  3. Narayanpet : అక్రమంగా ఇసుక రవాణా చేస్తున ట్రాక్టర్ పట్టివేత..!

  4. Union Minister : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన.. 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ..!

మరిన్ని వార్తలు