Devarakonda : గ్రామ పంచాయతీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట.. ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్..!

Devarakonda : గ్రామ పంచాయతీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట.. ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్..!
చింతపల్లి, మనసాక్షి :
గ్రామ పంచాయతీల అభివృద్ధికోసం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండల పరిధిలోని కుర్మేడ్ గ్రామంలో 1.91కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే 33/11కేవీ నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు. సందర్భంగా గ్రామ ప్రజలను రైతులను ఉద్దేశించి వారు మాట్లాడారు.
“పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేవలం స్వప్రయోజనాల కోసం కొన్ని గ్రామాలకు మాత్రమే అభివృద్ధి చేశారని, మారుమూల గ్రామాల్లో ప్రజల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గ ఆరోపించారు. దేశాభివృద్ధిలో గ్రామాలే కీలకమని నమ్మే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్, గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపుతుందని అన్నారు. గతంలో గ్రామాలలో సబ్ స్టేషన్లు దూరంగా ఉండటం వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడి, వృద్ధులు, చిన్న పిల్లలకు ఇబ్బందులు ఎదురయ్యేవని గుర్తు చేశారు.
ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామంలో విద్యుత్ అంతరాయం ఉండకూడదనే తపనతో మారుమూల గ్రామాలలో సబ్ స్టేషన్ నిర్మాణాలను చేపట్టి, ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ఇప్పటికే గృహజ్యోతి పథకం ద్వారా పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనమేనని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యాదగిరి రావు, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, విద్యుత్ శాఖ డి. ఇ విద్యాసాగర్,ఎ. డి. ఇ సైదులు, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపిడిఓ సుజాత, మండల విద్యుత్ శాఖ ఎ ఇ.మురళీకృష్ణ మండల ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ అంగిరేకుల నాగభూషణం , రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు ఎంఏ సిరాజ్ ఖాన్, మాజీ ఎంపీపీ కొండూరు భవాని ప పవన్ కుమార్, మాజీ వై స్ ఎంపీపీ యాచారం యాదగిరి గౌడ్, మాజీ జెడ్పిటిసి జటావత్ హరినాయక్ కురుమేడు,
మాజీ సర్పంచ్ రాటకొండ రుద్రమదేవి ఆర్ ఎం ప్రసాద్ , గౌని జంగయ్య గౌడ్, మాజీ ఎంపిటిసి ఉప్పు శ్రీశైలం, దాసరి శ్రీనివాస్ యాదవ్, అంగిరేకుల గోవర్ధన్, మాజీ సర్పంచ్ కురుమేటి బజార్, గుండ్లపల్లి నర్సిరెడ్డి, ముచ్చర్ల యాదగిరి, చిక్కొండ సాయి. చిక్కొండ పెద్దిరాజు, మాస భాస్కర్ , పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు వేళాయే.. రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!
-
Minister Komatireddy : మహిళలకు మంత్రి కోమటిరెడ్డి అతి బారీ శుభవార్త.. రైస్ మిల్లుల ఏర్పాటుకు తోడ్పాటు..!
-
Nalgonda : కాంగ్రెస్ పార్టీలో తిడితేనే పదవులు.. సీనియారిటీ జాంతానై.. కాంగ్రెస్ నేత ఫైర్..!










