TOP STORIESBreaking Newsfoodఆరోగ్యం
Banana : అరటిపండు ఆరోగ్యకరమే.. కానీ వారు తినకూడదు..!

Banana : అరటిపండు ఆరోగ్యకరమే.. కానీ వారు తినకూడదు..!
మన సాక్షి, ఫీచర్స్ డెస్క్:
అరటి పండు (Banana) చాలా పోషకాలు ఉన్న ఆరోగ్యకరమైన పండు. అయితే కొందరికి మాత్రం జాగ్రత్త అవసరం. అరటిపండు తినడం వల్ల కొంతమందికి మంచి లాభాలు ఉంటాయి. కానీ మరి కొంత మంది మాత్రం తినకూడదు అవేంటో చూద్దాం..
అరటి పండు వల్ల లాభాలు :
-
ఎనర్జీ ఎక్కువ ఇస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండి శరీరానికి వెంటనే శక్తి ఇస్తుంది.
-
జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మల బద్దక సమస్య తగ్గిస్తుంది.
-
హృదయ ఆరోగ్యం బలపడుతుంది. పొటాషియం (Potassium) అధికంగా ఉండి రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది.
-
ఇమ్యూనిటీ పెరుగుతుంది. విటమిన్ B6, C ఉండటం వల్ల శరీర నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
-
మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. స్ట్రెస్ తగ్గుతుంది.
-
బరువు పెరగాలి అనుకునేవారికి మంచిది. రోజూ 1–2 అరటిపండ్లు తింటే సహజంగా బరువు పెరుగడంలో ఉపయోగపడుతుంది.
-
అల్సర్ ఉన్నవారికి మంచిది. ఇది కడుపు లైనింగ్‌ను రక్షిస్తుంది.
అరటి పండు ఎవరు తినకూడదు :
-
షుగర్ (Diabetes) ఉన్నవారు అరటిపండులో చక్కెర ఎక్కువగా ఉంటుంది. తగ్గించాలి లేదా డాక్టర్ సూచన మేరకు మాత్రమే తినాలి.
-
కిడ్నీ సమస్యలు ఉన్నవారు పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీ సమస్య ఉన్నవారికి ప్రమాదం.
-
అలెర్జీ ఉన్నవారు తగ్గించుకోవాలి (చర్మం దద్దుర్లు, దురద వంటి లక్షణాలు వస్తే).
-
మైగ్రేన్ ఉన్నవారు కొందరికి అరటిపండి తినడం వల్ల మైగ్రేన్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది.
-
రాత్రి సమయంలో జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు
రాత్రిపూట అరటిపండు తింటే కొందరికి bloating లేదా indigestion రావచ్చు.
ఎవరు తింటే మంచిది :
రోజూ శ్రమ చేసే వారు, పిల్లలు, స్పోర్ట్స్ ఆడే వారు, బరువు పెరగాలని అనుకునేవారు, మల బద్దకం ఉన్నవారు.










