Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : నేడు విద్యుత్ కోత.. మండలాలు, వేళలు ఇవే..!

Miryalaguda : నేడు విద్యుత్ కోత.. మండలాలు, వేళలు ఇవే..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ డివిజన్ పరిధిలో గురువారం (18.12.2025) కొన్ని మండలాలకు కరెంటు కోత విధించనున్నట్లు మండలాలకు మిర్యాలగూడ ఎలక్ట్రికల్ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస చారి తెలిపారు. మాట్లాడుతూ మిర్యాలగూడ 220 కె.వి సబ్స్టేషన్లో స్టేషన్ ల్ మెయింటెనెన్స్ సందర్భంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యుత్తు బందు చేయడం జరుగుతున్నది.
మిర్యాలగూడ టౌన్ వన్, టౌన్ టు, మిర్యాలగూడ రూరల్, త్రిపురారం, వేములపల్లి, ఈ మండలాలకు సంబంధించిన 33 కె.వి / 11 కెవి సబ్స్టేషన్లకు కరెంటు ఉండదు కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని కోరుచున్నాము.. ఈ కార్యక్రమంలో ఏడిఈ రవికుమార్, ఏఈలు టౌన్ టు, రవీందర్ రెడ్డి, సబ్ ఇంజనీర్, అమర్ సింగ్, బాలు, నవీన్ రెడ్డి ఉన్నారు.









