Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District Sp : చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు..! 

గాలిపటాలు ఎగురావేయడానికి చైనిస్ మాంజా ను ఉపయోగించవద్దు అని జిల్లా ఎస్పీ కే నరసింహ తెలిపారు. చైనీస్ మాంజా (నైలాన్/సింథటిక్ దారం) విక్రయించడం, నిల్వ చేయడం మరియు వాడటంపై ప్రభుత్వం నిషేధం విధించిందని, పర్యావరణానికి, పక్షులకు మరియు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న ఈ ప్రమాదకరమైన మాంజాను విక్రయించడం చట్టరీత్యా నేరమని చెప్పారు.

District Sp : చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు..! 

సూర్యాపేట మనసాక్షి :

గాలిపటాలు ఎగురావేయడానికి చైనిస్ మాంజా ను ఉపయోగించవద్దు అని జిల్లా ఎస్పీ కే నరసింహ తెలిపారు. చైనీస్ మాంజా (నైలాన్/సింథటిక్ దారం) విక్రయించడం, నిల్వ చేయడం మరియు వాడటంపై ప్రభుత్వం నిషేధం విధించిందని, పర్యావరణానికి, పక్షులకు మరియు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న ఈ ప్రమాదకరమైన మాంజాను విక్రయించడం చట్టరీత్యా నేరమని చెప్పారు.

ఈ దారం గాలిపటాలు ఎగురవేసే సమయంలో మెడకు లేదా శరీర భాగాలకు తగిలితే తీవ్రమైన గాయాలు కావడమే కాకుండా ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని, గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. జిల్లాలోని ఫ్యాన్సీ షాపులు, గాలిపటాల విక్రయ కేంద్రాలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని, ఎక్కడైనా నిషేధిత చైనీస్ మాంజా కనిపిస్తే వెంటనే వాటిని సీజ్ చేయడమే కాకుండా సంబంధిత విక్రేతలపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.

కేవలం వ్యాపార లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని వ్యాపారులకు సూచించారు. పర్యావరణ హితమైన, సురక్షితమైన నూలు (కాటన్) దారాలను మాత్రమే విక్రయించాలని మరియు కొనుగోలు చేయాలని కోరారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల ఇట్టి విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా ఎవరైనా రహస్యంగా చైనీస్ మాంజా విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డైల్ 100 కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలను కోరారు.

MOST READ 

  1. Sarpanch : సల్కునూరు సర్పంచ్ గా సతీష్ గౌడ్ బాధ్యతల స్వీకరణ..!

  2. WhatsApp : వాట్సాప్‌లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!

  3. Sarpanch : ఆపద వస్తే ఆదుకుంటా.. నూతన సర్పంచ్ ఆర్థిక సహాయం..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు శుభవార్త..!

మరిన్ని వార్తలు