TOP STORIESBreaking Newsతెలంగాణ

TG News : తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఇక వారి కష్టాలు తీరినట్టే..!

తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త తెలియజేసింది. రైతులకు విద్యుత్ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టింది. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా విద్యుత్ ఆంబులెన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు.

TG News : తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఇక వారి కష్టాలు తీరినట్టే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త తెలియజేసింది. రైతులకు విద్యుత్ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టింది. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా విద్యుత్ ఆంబులెన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు.

బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. రైతులకు ట్రాన్స్ఫార్మర్ సమస్యలు, విద్యుత్ సరఫరా అంతరాయం సమస్యలను పరిష్కరించేందుకుగాను విద్యుత్ అంబులెన్స్ స్కీం తీసుకొచ్చినట్లు చెప్పారు.

ఏ సమస్య వచ్చినా 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు రైతులు ఫోన్ చేయాలని, వెంటనే 24 గంటల్లో సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా వారంలో మూడు రోజుల పాటు విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విద్యుత్ బాట కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు.

అధికారులు పొలాల్లోకి వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా కార్యక్రమం ఉంటుందన్నారు. అదనపు లోడ్ అవసరం ఉన్న రైతులకు మాత్రమే కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేస్తామని, అవసరం లేని చోట ఇవ్వడం లేదని భట్టి స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి కుసుం పథకం విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, కానీ తమ ప్రభుత్వం మాత్రం సమర్థవంతంగా అమలు చేస్తుందని చెప్పారు. ఈ పథకం అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కలిసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో వినియోగం కాకుండా మిగిలిపోయిన విద్యుత్ కోటాను తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు.

MOST READ : 

  1. ఆయిదేళ్లుగా స్టూడెంట్‌తో టీచర్ ప్రేమ.. తన భర్త తనకు కావాలంటూ భార్య ఆవేదన..!

  2. Suryapet : సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తు, జాగీరు కాదు.. రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి..!

  3. Miryalaguda : కారెక్కుతున్న నేతలు.. మిర్యాలగూడలో బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు..!

  4. Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి రైతు భరోసా కట్..!

  5. Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ అప్పుడే..!

మరిన్ని వార్తలు