Nalgonda : మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు అవసరం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
మానసికంగా , శారీరకంగా దృఢంగా ఉండేందుకు విద్యతోపాటు, క్రీడలు ముఖ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు .

Nalgonda : మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు అవసరం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
నల్లగొండ, మన సాక్షి:
మానసికంగా , శారీరకంగా దృఢంగా ఉండేందుకు విద్యతోపాటు, క్రీడలు ముఖ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు . గురువారం ఆయన నల్గొండ జిల్లా ,చర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాలలో నిర్వహించనున్న 2 రోజుల అంతర్ పాఠశాలల క్రీడా పోటీలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మనిషి చురుకుగా ఉండడానికి క్రీడలు ఎంతో ముఖ్యమని అన్నారు.
కొన్ని పాఠశాలలు అధిక జీపీఏలు సాధించాలన్న లక్ష్యంతో విద్య పైన దృష్టి సారిస్తున్నాయని, క్రీడల పట్ల కూడా దృష్టి పెట్టాలని అన్నారు. అలాగే ప్రైవేటు విద్యా యాజమాన్యాలు పేద విద్యార్థుల కు ఎల్లవేళలా సహాయం అందించేలా చూడాలన్నారు. క్రీడల్లో గెలుపు ,ఓటములను సమానంగా స్వీకరించాలని, ఓడిన వారు బాధపడకూడదని మరోసారి పట్టుదలతో ఆడి గెలుపు సాధించాలని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో భాగంగా ఒక్కొక్కటి 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నదని, నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్ఎల్బీసీ వద్ద నిర్మిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల భవనం నిర్మాణంలో ఉందని తెలిపారు.
తరగతి గదులు, డార్మెంటరీ ,డైనింగ్ ,కిచెన్, క్రికెట్ ఫుట్బాల్ స్టేడియంలతో ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగ్గా వీటిని నిర్మిస్తున్నామని, వచ్చే సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు. పాఠశాల/ కళాశాల వదిలిన వెంటనే ఉద్యోగం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వీటిని రూపొందిస్తున్నదని, ప్రతి విద్యార్థి జీవితంలో రాణించేలా చదువుకోవాలని కోరారు.
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గాఏర్పాటవుతున్నందున భవిష్యత్ లో నల్గొండ ను స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్థామని, ఆర్ అండ్ బి ద్వారా 200 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, 700 కోట్ల రూపాయలతో పట్టణంలో భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తున్నామని, నల్గొండను హైదరాబాద్ కు మోడల్ గా చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు మంత్రి తెలిపారు .
ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 12 కోట్ల రూపాయలతో నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం జరిగిందని, త్వరలోనే ఈ పాఠశాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ దైనందిన జీవితంలో క్రీడలు చాలా అవసరమని, శారీరకంగా, మానసికంగా ఉండేందుకు క్రీడలు తోడ్పడతాయని అన్నారు.
ప్రభుత్వం తరఫున విద్యార్థులకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదని, ఓడిన, గెలిచినవారు క్రీడలను సమానంగా తీసుకోవాలన్నారు. నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ , డిటిసి వాణి, పాఠశాల యాజమాన్యం, తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Miryalaguda : NH 167 విస్తరణకు గడువు ముగిసినా ఖాళీ చేయని ఇళ్ల యజమానులు.. సబ్ కలెక్టర్ నోటీసులు..!
-
TG News : ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..!
-
Urea App : రైతులు యూరియా యాప్ గురించి తెలుసుకోవల్సిందే.. అధికారులు ఏం చెప్పారంటే..!
-
Miryalaguda : కారెక్కుతున్న నేతలు.. మిర్యాలగూడలో బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు..!
-
ఆయిదేళ్లుగా స్టూడెంట్‌తో టీచర్ ప్రేమ.. తన భర్త తనకు కావాలంటూ భార్య ఆవేదన..!










