క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా

BIG BREAKING : ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్తుండగా కారు ప్రమాదం.. ప్రధానోపాధ్యాయురాలు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు..!

నల్గొండ జిల్లా కేంద్రం నుంచి పాఠశాలకు వెళ్తున్న ఉపాధ్యాయుల కారు ప్రమాదానికి గురైంది.  ప్రమాదంలో ప్రధానోపాధ్యాయురాలు మృతిచెందగా, మరో నలుగురు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి.

BIG BREAKING : ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్తుండగా కారు ప్రమాదం.. ప్రధానోపాధ్యాయురాలు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు..!

అర్వపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా కేంద్రం నుంచి పాఠశాలకు వెళ్తున్న ఉపాధ్యాయుల కారు ప్రమాదానికి గురైంది.  ప్రమాదంలో ప్రధానోపాధ్యాయురాలు మృతిచెందగా, మరో నలుగురు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి.

సంక్రాంతి పండగ సెలవులు ముగియడంతో పాఠశాలలు ప్రారంభించుటకు ఐదుగురు ప్రధాన ఉపాధ్యాయుల బృందం నల్గొండ జిల్లా కేంద్రం నుండి తుంగతుర్తి మండలానికి కారులో వస్తుండగా శనివారం ఉదయం 8 గంటల సమయాన అర్వపల్లి మండల కేంద్రంలో 365 బి ప్రధాన రహదారిపై కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలు పడిపోవడంతో ప్రధానోపాధ్యాయురాలు కల్పన మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిసింది.

అందరు కూడా తుంగతుర్తి మండలo లో పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలవవలసి ఉంది.

MOST READ : 

  1. Model Schools : మోడల్ స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..!

  2. Miryalaguda : ఎన్నికల ముందు మిర్యాలగూడలో అధికార పార్టీ జమ్మికులు..!

  3. Post Office : లక్షకు రెండు లక్షలు.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ గొప్ప స్కీం, కేంద్రం మద్దతు గ్యారెంటీ రిటర్న్స్..!

  4. Big Alert : హైదరాబాద్ వెళ్లే వాహనాల దారి మళ్లింపు.. ట్రాఫిక్ రద్దీ తో ప్రత్యామ్నాయ మార్గాలు..!

మరిన్ని వార్తలు