Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

ఫోన్ చేస్తే బాధితుల ఇంటికే పోలీస్.. ఎఫ్ఐఆర్ నమోదు..!

ఫోన్ చేస్తే బాధితుల ఇంటికే పోలీస్.. ఎఫ్ఐఆర్ నమోదు..!

బాధితులు పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు… మహిళా పిర్యాదులపై వెంటనే బాధితుల వద్దకు మహిళా పోలీస్ సిబ్బంది వస్తారు… రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు నూతన కార్యాచరణను పోలీస్ యంత్రాంగం సిద్ధం. ఎస్సి, ఎస్టీ లకు, మహిళలకు, బాలలకు, దివ్యాంగులకు, భయాందోళనలతో ఉన్న వారికి ఎంతో ఉపయోగం… ఈరకమైన పోలీస్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని.. సూర్యాపేట జిల్లా ఎస్పి కె.నరసింహ కోరుతున్నారు.

ఫోన్ చేస్తే ఇంటికే పోలీసులు వచ్చి పిర్యాదులు స్వీకరించి కేసులు నందు చేసి భరోసా కల్పించడం కోసం సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ కృషి చేస్తుంది. పోలీస్ స్టేషన్ కు రాలేని ప్రత్యేక పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఉన్న బాధితుల నుండి సమాచారం అందుకున్న వెంటనే బాధితుల వద్దకు వెళ్ళి పిర్యాదు స్వీకరించి అక్కడి నుండే కేసు నమోదు చేసి బరోసా కల్పించాలని, పోలీసు సేవల్లో పారదర్శకత కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అమలులోకి తెచ్చిన నూతన ప్రణాళిక కార్యాచరణను రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తామని జిల్లా ఎస్పి నరసింహ తెలిపారు.

ఈ ప్రణాళిక ప్రకారం ముఖ్యంగా శారీరక దాడులు గురైయ్యే వారికి, ఎస్సి , ఎస్టీ వర్గాల ప్రజలకు, బాలలకు, ర్యాగింగ్ కు గురయ్యే విద్యార్థులకు, వేధింపులకు గురయ్యే మహిళలకు, బాలలకు ఎంతో సహాయపడనుందన్నారు. దీని ప్రకారం అన్ని పోలీసు స్టేషన్ల సిబ్బందికి, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగినదని తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రజలకు మరింత సులభమైన సేవలు అందించేందుకు మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టిందన్నారు.

ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా బాధితులు తమ ఇంటి వద్ద నుంచే ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ ప్రణాళిక మేరకు పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్నవారి ఇంటికే పోలీసులు వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తానని తెలిపారు.

వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు లేదా భద్రతా కారణాల వల్ల బయటకు రాలేని బాధితులకు ఈరకమైన సేవలు ఉపయోగపడతాయని అన్నారు. ఫోన్ కాల్‌, ఆన్‌లైన్ అభ్యర్థన లేదా ఇతర మార్గాల ద్వారా సమాచారం అందగానే సంబంధిత పోలీస్ సిబ్బంది బాధితుల నివాసానికి చేరుకుని ఫిర్యాదు నమోదు చేస్తామని తెలిపారు.

ఈ విధానం ద్వారా ఫిర్యాదుల నమోదు ప్రక్రియ మరింత వేగవంతమవడంతో పాటు పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా శారీరక దాడులు, అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు, బాల్య వివాహాలు, ర్యాగింగ్ నిరోధక చట్టం, మైనర్ వేదింపులు, గృహహింస వంటి కేసుల్లో బాధితులకు ఇది ఎంతో సహాయపడనుంది అన్నారు.

By : MuthyamRaju, Suryapet 

MOST READ NEWS 

  1. Suryapet : సూర్యాపేట పోలీసులు ఎఫ్ ఐ ఆర్ ఎట్ డోర్ స్టెప్ నూతన కార్యక్రమం.. బాధితుల ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరణ..!

  2. Gold Price : బాబోయ్.. పసిడికి ఊహించని ధర, ఒక్కరోజే అంత పెరిగిందా.. ఆల్ టైం రికార్డ్..!

  3. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

  4. Rythu : రైతుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా..!

మరిన్ని వార్తలు