మహిళలకు ఉచిత బ్యూటిషన్ శిక్షణ..!
భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో శ్రీయాస్ బ్యూటీ అకాడమీ బోయిన్పల్లిలో ఉచిత బేసిక్ బ్యూటీషియన్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు అకాడమీ సీఈవో శ్రీలత శ్రావణ్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

మహిళలకు ఉచిత బ్యూటిషన్ శిక్షణ..!
శంకర్పల్లి, (మన సాక్షి):
భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో శ్రీయాస్ బ్యూటీ అకాడమీ బోయిన్పల్లిలో ఉచిత బేసిక్ బ్యూటీషియన్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు అకాడమీ సీఈవో శ్రీలత శ్రావణ్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కోర్స్ ద్వారా మొత్తం 25 మంది మహిళలకు ఉచిత శిక్షణ అందించబడుతుందని, కోర్సు వ్యవధి ఒక నెల కాగా, శిక్షణ పూర్తయిన అనంతరం అభ్యర్థులకు ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం అందజేస్తారని తెలియజేశారు. 18 నుండి 45 సంవత్సరాల వయస్సు గల వారు దరఖాస్తుకు అర్హులన్నారు. కనీస విద్యార్హత పదవ తరగతి ఉత్తీర్ణత అవసరం అన్నారు. దరఖాస్తు సమయంలో రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా సమర్పించాలని కోరారు.
ఈ కోర్సు కోసం రెండు బ్యాచ్ లు నిర్వహించబడుతున్నాయని చెప్పారు. మొదటి బ్యాచ్ ఫిబ్రవరి 9న, రెండవ బ్యాచ్ ఫిబ్రవరి 18న ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. సీట్లు పరిమితంగా ఉన్నందున అర్హులైన మహిళలు త్వరగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 9989610703 నెంబర్ కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
MOST READ :
-
అత్యంత వైభవంగా ‘100 డేస్ లవ్ స్టోరీ’ ట్రైలర్ విడుదల..!
-
Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!
-
Medaram : మేడారం జంపన్న వాగులో మునిగిన భక్తులు.. కాపాడిన SDRF బృందం..!
-
Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!
-
Rythu Bharosa : అప్పుడే రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!